Begin typing your search above and press return to search.
100 శాతం వ్యాక్సినేషన్ నగరంగా హైదరాబాద్ !
By: Tupaki Desk | 20 Aug 2021 3:00 PM ISTవచ్చే 10-15 రోజుల్లో హైదరాబాద్ ను వంద శాతం కరోనా వైరస్ వాక్సినేషన్ జరిగిన నగరంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెచ్ ఎం సీ కమిషనర్, జీహెచ్ ఎం సీ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ ఎం సీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, డీఎంహెచ్ వోలు, ఎస్ పీ హెచ్ వో లతో నగరంలోని బీఆర్ కేఆర్ భవన్ లో గురువారం వర్క్ షాప్ నిర్వహణ జరిగింది.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ..నగరంలోని అన్ని కాలనీలను 100% వాక్సినేషన్ కాలనీలుగా తీర్చిదిద్దేందుకు శాసనసభ్యులు, స్థానిక కార్పొరేటర్లను భాగస్వాములను చేస్తూ, జీహెచ్ ఎం సీ, ఆరోగ్యశాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఇంటింటికి తిరిగి సర్వే జరిపి 18 సంవత్సరాలపై బడిన అర్హత కలిగిన వ్యక్తులను మాప్ అప్ చేయాలని తెలిపారు. ఒక ఉద్యమముగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. మొబైల్ వాక్సినేషన్‌కు మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు.
మొబైల్ వాక్సినేషన్ కు మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో ఇంటింటికి తిరిగి మిగిలిన వ్యక్తులకు వాక్సినేషన్ చేసేందుకు సిబ్బంది, మెటీరియల్ తో కాలనీల వారీగా టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ ఎం సీ కమిషనర్ లోకేశ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మేడ్చల్ , మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. హన్మంత రావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు, ఓఎస్డి టు సీఎం డా.గంగాధర్, హైదరాబాద్ డీఎంహెచ్ వో డాక్టర్ వెంటటి, రంగారెడ్డి డీఎంహెచ్ వో డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, మేడ్చల్ మల్కాజిగిరి డీఎంహెచ్ వో డాక్టర్ మల్లికార్జున్, సంగారెడ్డి డీఎంహెచ్ వో డా. గాయత్రి తదితర అధికారులు పాల్గొన్నారు.
దేశంలోనే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తొలి నగరంగా భువనేశ్వర్ నిలిచిన సంగతి తెలిసిందే. నగరంలో 18 ఏళ్లు పైబడిన జనాభా మొత్తానికి జులై 31 నాటికి వ్యాక్సిన్లు వేశారు. అంతేకాదు,1లక్ష మంది వలస కూలీలకు సైతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. నగరంలో విస్తృతంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి తక్కువ వ్యవధిలోనే ఈ టార్గెట్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం భారత్ లో 18 ఏళ్లు పైబడినవారి జనాభా దాదాపు 94 కోట్లు పైమాటే. వీరందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలంటే 188 కోట్ల డోసులు కావాలి. జులై పూర్తయ్యే నాటికి 47 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ లెక్కన ఏడాది చివరి నాటికి మొత్తం జనాభాకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం కష్టంగానే కనిపిస్తోంది. అవసరానికి సరిపడా వ్యాక్సిన్ల సప్లై లేకపోవడం వల్లే వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని చెబుతున్నారు. అయితే అగస్టు,సెప్టెంబర్ మాసాల్లో దాదాపు 35 కోట్ల వ్యాక్సిన్ సప్లై జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.