Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: పడవ మునిగి 100 మంది గల్లంతు!

By:  Tupaki Desk   |   5 Nov 2020 3:20 PM IST
బ్రేకింగ్: పడవ మునిగి 100 మంది గల్లంతు!
X
దేశంలోని గంగానదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్ లో జరిగిన పడవ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం భగల్ పూర్ జిల్లాలోని గంగానదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 100మందికి పైగా రైతులు, కూలీలతో వెళ్తున్న పడవ గంగానదిలో మునిగిపోయింది.

నౌ గచ్చియా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి పడవలో కూలీలను,రైతులను ఎక్కించడమే కాకుండా సైకిళ్లు,బైక్ లతో నదిని దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 15 మంది దాకా ఈత కొడుతూ ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బాధిత కుటుంబాల సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది.