Begin typing your search above and press return to search.

భారత్ లో తోలి కేసు జనవరి 30..మహమ్మారి ప్రయాణం సాగిందిలా!

By:  Tupaki Desk   |   12 May 2020 6:30 AM GMT
భారత్ లో తోలి కేసు జనవరి 30..మహమ్మారి ప్రయాణం సాగిందిలా!
X
చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తూ అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి భారత్ లో కూడా వేగంగా విజృంబిస్తు ... డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. చాప‌కింద నీరులా విస్త‌రిస్త దేశ‌వ్యాప్తంగా ఈ ర‌క్క‌సి పంజా విసురుతోంది. ఈ ఏడాది చివ‌ర్లో భార‌త్‌ లో ప్ర‌వేశించిన ఈ వైర‌స్ మొదట్లో పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా ఆ తరువాత చాలా వేగంగా విస్త‌రిస్తోంది.

చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని జనవరి 30న భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ ‌కు సంబంధించి దేశంలోని పలు నగరాల్లో అనుమానిత కేసులు నమోదయ్యాయి. కానీ వైరస్ సోకినట్లు ధ్రువీకరించిన తొలి కేసు ఇదే . ఇక జనవరి 30 న తోలి మహమ్మారి పాజిటివ్ కేసు నమోదు కాగా ....10 వేల కేసుల‌ను చేర‌డానికి 74 రోజులు ప‌ట్టింది. ఆ త‌ర్వాత క్ర‌మంగా అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ మంది బాధితులు వైర‌స్ బారిన ప‌డుతూ వ‌చ్చారు.

అలా మొద‌లైన ఈ వైర‌స్ వ్యాప్తి …10 వేల నుంచి 20 వేల‌కు 9 రోజుల స‌మ‌యం ప‌ట్ట‌గా.. 20 వేల నుంచి 30 వేల‌ను చేర‌డానికి 8 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. 30 వేల నుంచి 40 వేల‌కు 6 రోజులు, 40 వేల నుంచి 50 వేల‌కు 4 రోజులు, 50 వేల నుంచి 60 వేల‌కు నాలుగు రోజులు, 60 వేల నుంచి 70 వేల‌ను చేర‌డానికి 3 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ప‌ట్టింది. దీన్ని బట్టి చూస్తే దేశంలో ఈ మహమ్మారి ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థమౌతుంది.