Begin typing your search above and press return to search.

భార్య, ఆమె 14మంది లవర్స్ పై 100 కోట్ల పరువునష్టం

By:  Tupaki Desk   |   31 July 2020 3:40 PM IST
భార్య, ఆమె 14మంది లవర్స్ పై 100 కోట్ల పరువునష్టం
X
అతడో బిజినెస్ మ్యాన్.. కోల్ కతాలో ఉంటాడు. రెండేళ్ల కిందట ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లుగా సజావు గా సాగుతున్న వీరి కాపురంలో అనుకోని మలుపు.. ఏడు ఎనిమిది నెలలుగా భార్య ప్రవర్తనలో మార్పు.. తనను దగ్గరకు రానీయకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ను భార్య పై నిఘా కోసం పెట్టాడు. అప్పుడే ఆమె గుట్టు రట్టు అయ్యింది.

ఒకరు కాదు.. ఇద్దరు కాదు... ఏకంగా 14మందితో ఎఫైర్స్ పెట్టుకొని వారితో కలువడాన్ని డిటెక్టివ్ గుర్తించి భర్తకు పక్కా ఆధారాలతో సమర్పించాడు. 14మందితో ఎఫైర్ పెట్టుకున్నాక ఇక భర్తకు ఏం సుఖం పంచుతుంది. అందుకే భార్యతోపాటు ఆ 14మంది లవర్స్ కు అదిరిపోయే రీతిలో షాకిచ్చాడు ఆ భర్త.

తాజాగా భార్యతోపాటు 14మంది ఆమె లవర్స్ పై ఏకంగా 100కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశాడు. తన పరువుకు భంగం కలిగేలా వీరంతా వ్యవహరించారని ఈ బిజినెస్ మ్యాన్ లీగల్ నోటీసులు పంపాడు. డబ్బు చెల్లించకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని హెచ్చరించాడు.

ఇలా భార్య మోసాన్ని కూడా సదురు బిజినెస్ మెన్ ‘క్యాష్’ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.