Begin typing your search above and press return to search.
షాకింగ్ గా.. 17 ఏళ్ల ఈ హైదరాబాదీ పిశాచి
By: Tupaki Desk | 7 July 2017 11:41 AM ISTపేరుకు మైనరే కానీ.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో దారుణాలకు పాల్పడిన ఒక హైదరాబాదీ వైనం ఇప్పుడు షాకింగ్ మారింది. ఆడపిల్లల్ని బయటకు పంపాలంటే భయపడే తల్లిదండ్రులు.. ఈ ఉదంతం గురించి విన్నాక అబ్బాయిల్ని బయటకు పంపటానికి కూడా జంకే దుస్థితి. రోజులు గడుస్తున్నకొద్దీ ఎక్కడికి పోతున్నామో అర్థం కాని ఈ నయా పైశాచిత్వకం గురించి వింటే నోట మాట రాదంతే.
నిండా పద్దెనిమిదేళ్లు కూడా లేని ఈ ఈ హైదరాబాదీ మైనర్ ముచ్చట ఇప్పుటు పెను సంచలనాన్ని సృష్టించటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. ఈ పిశాచి పాలిట పడి పదేళ్ల చిన్నారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఈ మైనర్ పిశాచి ఏం చేస్తాడన్న విషయంలోకి వెళితే..
హైదరాబాద్ పాతబస్తీ లోని బార్కాస్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ జమీల్ ఖాన్ కు మహ్మద్ ఖాన్ అనే పదేళ్ల కొడుకు ఉన్నాడు. లోకల్ గా ఉండే లయోలా స్కూల్లో నాలుగో క్లాస్ చదువుతుంటాడు. రంజాన్ సందర్భంగా బార్కాస్ బజార్లో ఏర్పాటు చేసిన మేళా దగ్గర ఈ పిల్లాడు ఆడుకుంటున్నాడు. బిస్కెట్లు.. చాక్లెట్లు ఆశ చూపించిన 17 ఏళ్ల మైనర్ పిశాచి.. బార్కాస్ ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకెళ్లి.. అసహజపద్దతితో లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన చిన్నారి.. తనకు నొప్పిగాఉందని.. జరిగింది తన తండ్రికి చెబుతానని చెప్పటంతో సదరు మైనర్ పిశాచి భయపడిపోయాడు. తానుచేసిన పాడు పని గురించి బయటకు తెలిస్తే.. తన ఇంట్లో జరిగే అక్క పెళ్లి ఆగుతుందని భావించి ఆ పిల్లాడ్ని రాడ్.. కర్రలతో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడ నుంచి మాయం చేసేందుకు వీలుగా కాళ్లు.. చేతులు కట్టేశాడు. మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసినా సాధ్యం కాకపోవటంతో అక్కడే వదిలేశాడు. ఈ దారుణం జరిగింది మూడో అంతస్తులో కావటం.. పాడుబడినట్లుగాఉండే అక్కడికి ఎవరూ వెళ్లరన్న ఉద్దేశంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
తమ పిల్లాడు మిస్ అయిన ఫిర్యాదుతో అలెర్ట్ అయిన పోలీసులు బార్కాస్.. చాంద్రాయణ గుట్ట పరిసరాల్లోని సీసీ కెమేరాల్ని పరిశీలించారు. బడీ మసీదు ప్రాంతంలో ఉన్న ఫీడ్ ను పరిశీలించగా.. ఒక కుర్రాడు తన కొడుకును తీసుకెళ్లిన వైనాన్ని గుర్తించారు. ఆ మైనర్ తన ఇంటి పక్కనే ఉండే వాడిగా బాధిత తండ్రి చెప్పారు. పాన్ షాప్ లో పని చేసే ఆ కుర్రాడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని సీసీ కెమేరా ఫుటేజ్ చూపించటంతో తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసుల విచారణలో మరింత షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. ఈ తరహా అసహజ లైంగిక దాడుల్ని ఇప్పటికే తాను పదిహేను వరకూ చేసినట్లుగా ఆ మైనర్ ఒప్పుకున్నాడు. బాధితులందరి దగ్గర వాంగ్మూలాన్ని సేకరించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పెరిగిన స్మార్ట్ ఫోన్ వినియోగం.. అశ్లీల వీడియోలతో పక్కదారి పట్టిన యువత ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. తాజా ఉదంతం వింటే.. అబ్బాయి అయినా అమ్మాయి అయినా.. ధైర్యం చేసి బయటకు పంపలేరని చెప్పక తప్పదు.