Begin typing your search above and press return to search.

టీవీ9 రవిప్రకాష్ పై 10టీవీ సంచలన కథనం

By:  Tupaki Desk   |   10 May 2019 11:45 AM GMT
టీవీ9 రవిప్రకాష్ పై 10టీవీ సంచలన కథనం
X
టీవీ9 సీఈవో రవిప్రకాష్ వివాదంపై తెలుగు న్యూస్ చానెల్ 10టీవీ సంచలన కథనాన్ని ప్రచురించింది. టీవీ9 యాజమాన్య వివాదంలో శివాజీ-రవిప్రకాష్ కలిసి చేసిన కుట్ర ఇదేనంటూ సంచలన విషయాలను చెప్పుకొచ్చింది. టీవీ9పై కొత్త సంస్థకు యాజమాన్య హక్కు లేకుండా చేయడానికే శివాజీని రంగంలోకి దించి రవిప్రకాష్ చాకచక్యంగా నాటకాలాడారని పేర్కొంది. శివాజీతో ఎన్ సీబీఎల్ లో కేసు వేయించి.. అలంద మీడియాకు టీవీ9 చేతుల్లోకి పోకుండా రవిప్రకాష్ కుట్ర పన్నారని 10టీవీ తన కథనంలో పేర్కొంది.

*10టీవీ తన కథనంలో రవిప్రకాష్ పై చేసిన 6 సీరియస్ ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆరు ప్రశ్నలను సంధించిన టీవీ10 అదే సమయాల్లో దానివెనుకున్న నిజాలను జవాబుల రూపంలో అందించింది. అవేంటి? అందులోని విమర్శలు ఏంటో యథాతథంగా చూద్దాం..

1.తెల్లకాగితంపైన రవిప్రకాష్, శివాజీ అగ్రిమెంట్ చేసుకుంటారా?

శ్రీనిరాజు నేతృత్వంలోని 90శాతం వాటాను అలందా మీడియా సంస్థ 500 కోట్లకు పైగా వెచ్చించి కొన్నట్టు సమాచారం. కొత్త సంస్థ డైరెక్టర్లను కూడా నియమించింది. అయితే కొత్త సంస్థలతో తనకు స్వేచ్చ ఉండదని.. తన ఆటలు సాగవని భావించిన టీవీ9 సీఈవో రవిప్రకాష్ తన స్నేహితుడు శివాజీ ద్వారా తెల్లకాగితంపై అగ్రిమెంట్ చేసుకొని తనకున్న 8శాతం షేర్లలో 40వేల షేర్లను బదిలీ చేశారు. ఆ తర్వాత తనకు షేర్లు బదిలీ అయ్యాయని ఏబీసీఎల్ యాజమాన్యాన్ని మార్చవద్దంటూ శివాజీ ఎన్.సీఎల్ టీలో కేసు వేశారు. కేవలం కొత్తగా టీవీ9ను కొన్న అలంద మీడియాసంస్థను టీవీ9లోకి రాకుండా.. వారిని అడ్డుకునే కుట్రలో భాగంగానే రవిప్రకాష్-శివాజీ ఇలా కుట్ర చేశారని కనిపిస్తోందని 10టీవీ కథనంలో పేర్కొంది.

2.షేర్లు కొన్న వాళ్లు ఎవరైనా, వాటి బదిలీ కోసం ఏడాది గడువు ఇస్తారా?

టీవీ9 మీడియా సంస్థలను కొన్న అలందాకు కేవలం రెండు రోజుల్లోనే పాత యజమాని శ్రీనిరాజు షేర్లు బదిలీ చేశారు. కానీ శివాజీకి 40వేల షేర్లు కేటాయించిన రవిప్రకాష్ ఏడాది వరకు గడువు ఇచ్చి అప్పటివరకు బదిలీ చేస్తానని ఒప్పందం చేసుకున్నారు.ఇలా చేయడం నిబంధనలకు విరుద్దం.. ఇందులో కుట్ర కోణం ఉన్నట్టే. షేర్లు ఇచ్చి వెంటనే ఎవరైనా బదిలీ చేస్తారు. రవిప్రకాష్-శివాజీలు ఇలా చేయడం అనుమానాలకు తావిస్తోందని 10టీవీ తన కథనంలో పేర్కొంది.

3. 90శాతం వాటా షేర్లు శ్రీనిరాజు సంస్థల నుంచి అలందా మీడియాకు కేవలం రెండు రోజుల్లో సక్రమంగా సజావుగా బదిలీ అయితే.. రవిప్రకాష్ నుంచి 40వేల షేర్లు శివాజీకి ఏడాది గడువు దాటినా ఎందుకు బదిలీ అవ్వలేదు?

90శాతం వాటా షేర్లు శ్రీనిరాజు సంస్థల నుంచి అలందా మీడియాకు కేవలం రెండు రోజుల్లో సక్రమంగా సజావుగా బదిలీ అయ్యాయి. ఆగస్టు 23, 2018న అలందా మీడియా ఒప్పందం కుదుర్చుకొని ఆగస్టు 25న డబ్బులు చెల్లించింది. దీనికి అనుగుణంగా శ్రీనిరాజు ఆగస్టు 28న టీవీ9 షేర్లన్నింటిని అలందా మీడియాకు బదలాయించారు. ఇదంతా వారం లోపు జరిగింది. కానీ రవిప్రకాష్ నుంచి 40వేల షేర్లు శివాజీకి బదిలీ చేశారు. అయితే ఏడాది గడువు లోపు ఎప్పుడైనా బదిలీ చేస్తానని రవిప్రకాష్ తెల్లకాగితంపై ఒప్పందాన్ని శివాజీకి రాసి ఇచ్చాడు. దీన్నే 10 టీవీ ప్రశ్నించింది. రవిప్రకాష్-శివాజీ కలిసి యాజమాన్య మార్పు కాకుండా.. టీవీ9పై తన ఆదిపత్యం పోకుండా ఉండేందుకే రవిప్రకాష్ ఈ కుట్రకు పాల్పడ్డారని 10టీవీ తన కథనంలో పేర్కొంది.

4.శివాజీని వ్యక్తిగతంగా మోసం చేసింది రవిప్రకాష్ అయితే ఏబీసీఎల్ లో ఎందుకు శివాజీ ఏబీసీఎల్ బోర్డును మార్చకూడదంటూ ఎన్ సీఎల్ టీలో కేసు దాఖలు చేయడానికి కారణం ఏంటి.?

నిజంగా రవిప్రకాష్ మోసం చేస్తే పోలీసులకు కానీ.. కోర్టులో కానీ శివాజీ ఫిర్యాదు చేయాలి. కానీ ఎందుకు ఎన్ సీఎల్ టీలో యాజమాన్య బదిలీని ఆపాలని ఫిర్యాదు చేస్తారని.. ఇది రవిప్రకాశ్-శివాజీ కలిసి ఆడిన డ్రామా అని 10 టీవీ ప్రశ్నించింది.

5. రవిప్రకాష్ కు నోటీసును రిజిస్టర్ పోస్టులో కాకుండా స్వయంగా ఎందుకిచ్చారు?

ఇక రవిప్రకాష్ షేర్లను ఇవ్వకుండా మోసం చేస్తే ఎవరైనా రిజిస్ట్రర్ పోస్టులో నోటీసులు ఇచ్చి కోర్టుకీడుస్తారు. కానీ స్వయంగా వెళ్లి వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడంపై 10టీవీ అనుమానాలు వ్యక్తం చేసింది. మోసం చేసిన వారికి ఇలా వ్యక్తిగతంగా ఆధారం లేకుండా ఎవరిస్తారని ప్రశ్నించింది. ఇది ఇద్దరు చేసిన కుట్ర అని తేటతెల్లమవుతోందని కథనంలో పేర్కొంది.

6. ఏబీసీఎల్ పాత యాజమాన్యంపై సైఫ్ త్రీ మారిషస్ కంపెనీ కేసులో సెప్టెంబర్ 4, 2018 న ఎన్సీఎల్ టీ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే ఆ విషయం కంపెనీ సీఈవోగా ఉన్న రవిప్రకాష్ కు 2019 వరకూ తెలియదా.?

శివాజీ అందించిన నోటీసు 2018న చేస్తే.. తనకు మార్చి 30వరకు అంటే ఆరు నెలల తర్వాత కూడా టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాష్ తెలియదని పేర్కొనడం మోసమని 10టీవీ ఆరోపించింది. కంపెనీ సీఈవోకు యాజమాన్యంలో జరిగిన అతిపెద్ద వివాదం.. షేర్ల మార్పిడి లొల్లి గురించి 6 నెలల దాకా తెలియదా అని ప్రశ్నించింది.