Begin typing your search above and press return to search.

జగన్ తో టచ్ లో వంశీతోపాటు 10మంది..

By:  Tupaki Desk   |   26 Oct 2019 4:59 PM IST
జగన్ తో టచ్ లో వంశీతోపాటు 10మంది..
X
తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఆయనను బూచీగా చూపి మరో పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు దుకాణం సర్దేసేందుకు రెడీ అవుతున్నారన్న మాట తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతోంది.

వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరితే రాజ్యసభ లేదా సముచిత స్థానం కల్పిస్తామని వైసీపీ వర్గాల నుంచి హామీ లభించినట్టు తెలిసింది. దీంతో వంశీ వైసీపీలో చేరేందుకు దాదాపు లైన్ క్లియర్ చేసుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వంశీ పార్టీలో చేరితే ఆయన మంచి ప్రాధాన్యత ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందట..

ఇక వంశీకి వైసీపీలో దక్కుతున్న క్రేజ్ చూసి మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గోడ దూకేందుకు రెడీ అయ్యారట.. ఇదే జరిగితే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా గల్లంతవ్వడం ఖాయమన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.

ప్రస్తుతం ఉన్న ఏపీ అసెంబ్లీలో 10శాతం సీట్లు సాధిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈ లెక్కన 18 సీట్లు ఉంటే చాలు. కానీ చంద్రబాబుకు అసెంబ్లీలో 23 ఎమ్మెల్యే సీట్లున్నాయి. ఇప్పుడు 10 మంది కనుక వైసీపీ లో చేరితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా గల్లంతుకావడం ఖాయం. దీపావళి తర్వాత ఏపీ రాజకీయాల్లో ఈ మార్పులు శరవేగంగా జరుగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని తెలుగు తమ్ముళ్లు, కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున వైసీపీ లో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది.