Begin typing your search above and press return to search.

కరోనా జయించిన 10 నెలల పసికందు

By:  Tupaki Desk   |   7 April 2020 9:10 AM GMT
కరోనా జయించిన 10 నెలల పసికందు
X
మహమ్మారి కరోనా వైరస్‌ తో మానవ ప్రపంచంలో కల్లోలం రేగుతోంది. ఈ వైరస్‌ బారిన పడి వేలాది మంది మృతిచెందుతుండగా లక్షలాది మంది ప్రజలు ఆ వైరస్‌ తో సతమతమవుతున్నారు. అయితే ఆ వైరస్‌ చిన్నారులు - వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వారికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆ వైరస్‌ సోకిన వృద్ధులు పిట్టల్లా రాలుతున్నారు. ఇక చిన్నారుల పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే మన దేశంలో మాత్రం ఓ పసికందు ఆ వైరస్‌ బారిన పడి ఆరోగ్యంతో బయటపడ్డాడు.

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ వివాహిత ఓ బాలుడికి జన్మినిచ్చింది. ప్రస్తుతం 10 నెలల బాలుడు. అయితే ఆ బాలుడికి విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ సోకింది. చిన్నారితో పాటు వారి కుటుంబసభ్యులను మార్చి 29వ తేదీన కోయంబత్తూరులోని ఈఎస్ఐ ఆస్పత్రి లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డు లో చేర్చారు. అప్పటి నుంచి చిన్నారిని వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తూ వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే బాలుడు ఆ వైరస్‌ నుంచి కోలుకున్నాడు. వైరస్ తగ్గుముఖం పట్టడంతో 8 రోజుల తర్వాత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వీరితో పాటు వైరస్ తగ్గిన ఐదుగురిలో బాలుడి తల్లి - అమ్మమ్మ - 25 ఏళ్ల వ్యక్తి సహా మరొకరు డిశ్చార్జ్ అయ్యారు. తమిళనాడు లో వైరస్‌ నుంచి కోలుకున్న వారు మొత్తం 12మంది.

తమిళనాడులో కూడా కరోనా వైరస్ తీవ్రంగానే ఉంది. సోమవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 621 కి చేరాయి. ఈ రాష్ట్రం లో ఇప్పటి వరకు 19 మంది చనిపోయారు.