Begin typing your search above and press return to search.

స్వదేశానికి తిరిగొచ్చిన 10 లక్షల మంది !

By:  Tupaki Desk   |   12 Aug 2020 6:30 AM GMT
స్వదేశానికి తిరిగొచ్చిన 10 లక్షల మంది !
X
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. చైనాలో వెలుగుచూసిన ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇప్పుడు భయంతో వణికిపోతోంది. ఈ కరోనా వైరస్ ప్రపంచంలో వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనాను అరికట్టడానికి ప్రపంచంలోని చాలా దేశాలు అనూహ్యంగా లాక్ డౌన్ ను ప్రకటించాయి. దీనితో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి. ఇండియా లో కూడా మర్చి 25 నుండి లాక్ డౌన్ అమలు చేసారు. ఇంకా ఇప్పటికి కూడా సడలింపులతోనే లాక్ డౌన్ కొనసాగుతుంది. దేశంలో కరోనా కట్టడిలోకి రాకపోవడంతో విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దేశీయ విమానాలు ప్రారంభించినప్పటికీ విదేశీ విమాన ప్రయాణాలకు ఇప్పట్లో అనుమతి వచ్చేలా కనిపించడం లేదు.

అయితే , కరోనా లాక్ డౌన్ కారణంగా ఇండియా కి తిరిగి రావాలని, రాలేకపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన వందేభారత్‌ మిషన్‌ ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. కరోనా సంక్షోభ నేపథ్యంలో ప్రవాస భారతీయుల కోసం ఈ మిషన్‌ను మే 7న ఆరంభించారు. ఈ వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దాదాపు 10 లక్షల మందిని భారత్ ‌కు తిరిగితెచ్చినట్లు, అలాగే భారత్‌ నుంచి దాదాపు 1.3 లక్షల మంది వివిధ దేశాలకు విమానాల ద్వారా వెనక్కు వెళ్లారని పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వందేభారత్‌ మిషన్‌లో 5వ దశ నడుస్తోంది. ఇందులో దాదాపు 1.3 లక్షల భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.