Begin typing your search above and press return to search.

10 లక్షల మంది ఇండియన్స్ క్రెడిట్ కార్డు డీటెయిల్స్ లీక్ !

By:  Tupaki Desk   |   21 April 2021 12:30 AM GMT
10 లక్షల మంది ఇండియన్స్  క్రెడిట్ కార్డు డీటెయిల్స్ లీక్ !
X
సైబర్ సెక్యురిటీలో డేటా చోరీ అనేది అతిపెద్ద సమస్యగా మారుతున్న ఈ సమయంలో మరో వార్త ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తుంది. అదేమిటి అంటే .. ప్రముఖ పిజ్జా బ్రాండ్ డొమినోస్ సర్వర్ల నుంచి భారీగా డేటా లీక్ అయిందట. ఇండియన్స్ క్రెడిట్ కార్డు డేటా లీక్ అయిందని ఇజ్రాయోల్‏ కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ అండర్ దీ బ్రీచ్ వెల్లడించింది. పేరు, ఫోన్ నంబర్లు, ఇమెయిల్ చిరునామాల వివరాలు దాదాపు 10 లక్షల మంది క్రెడిట్ కార్డు వివరాలు డార్క్ వెబ్ లోకి వెళ్ళాయి. ఇవన్ని డొమినోస్ సర్వర్‌లో 18 కోట్ల ఆర్డర్లకు సంబంధించిన సమాచారం.

లీక్ అయిన డేటా వివరాలన్ని కూడా డార్క్ వెబ్‌ లో అమ్మకానికి ఉన్నాయని అండర్ ది బ్రీచ్ గుర్తించింది. 250 డొమినోస్ ఉద్యోగుల డేటా కూడా లీక్ అయింది. ఈ డేటా మొత్తం 13 టీబీ సైజ్‌ లో ఉన్నట్టు అండర్ ది బ్రీచ్ చీఫ్ అలోన్ గాల్ తెలిపారు. ఈ డేటా లీక్ ఆరోపణల్ని డొమినో పేరెంట్ కంపెనీ అయిన జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ ఖండించలేదు. కానీ ఫైనాన్షియల్ డేటా లీక్ అయిందన్న వార్తలని మాత్రం తిరస్కరించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఇటీవల సమాచార భద్రతా సమస్యను ఎదుర్కొంది. ఏ వ్యక్తి యొక్క ఆర్ధిక సమాచారానికి సంబంధించిన డేటా ఏదీ యాక్సెస్ చేయబడలేదు. మా విధానం ప్రకారం వినియోగదారుల ఆర్థిక వివరాలు లేదా క్రెడిట్ కార్డు డేటాను మేం స్టోర్ చేయలేము.

అందువల్ల డేటా లీక్ అయ్యే అవకాశమే లేదని జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపింది. ప్రస్తుతం దీనిపై తమ దర్యాప్తు కొనసాగుతుందని వివరించింది. హ్యాకర్లు చేతికి చిక్కిన క్రెడిట్ కార్డ్ డేటా మొత్తం భారతీయ యూజర్లదే , కావడం అలాగే 10 లక్షలకు పైగా యూజర్ల క్రెడిట్ కార్డుల వివరాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. 18కోట్ల ఆర్డర్స్ వివరాలు, చిరునామాలు, బిల్లింగ్ డీటెయిల్స్ 10 లక్షల క్రెడిట్ కార్డు వివరాలదే అని యుటిబి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అలోన్ గాల్ ఓ ట్వీట్ చేశారు. ప్పుడు డేటా లీక్ జరిగినా అందులో భారతీయులో ఎక్కువగా బాధితులు ఉంటున్నారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT-IN డేటా ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఇండియాలో సైబర్ దాడులు 300 శాతం పెరిగాయి.