Begin typing your search above and press return to search.
కల్తీ మద్యం సేవించి 10 మంది మృతి - ఆస్పత్రిలో మరో 12 మంది!
By: Tupaki Desk | 12 Jan 2021 6:02 PM ISTదేశంలో కల్తీ మద్యం అరికట్టాలని ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా , కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధించడం కష్టంగా మారుతుంది. ఈ కల్తీ మద్యం ద్వారా ఎంతోమంది తమ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. తాజాగా కల్తీ మద్యం సేవించి పది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. మోరెనా జిల్లాలో కల్తీ మద్యం తాగి పలువురు అస్వస్థతకు గురికాగా.. చెహ్రా మాన్‌పూర్, పెహ్ వాలీలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బాధితులకు ప్రస్తుతం గ్వాలియర్ లోని ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత అక్టోబరులోనూ కల్తీ మద్యం తాగి 15 మంది కూలీలు చనిపోయిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు. నాలుగు రోజుల కిందట ఉత్తర్‌ప్రదేశ్ లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందగా, 16 మంది ఆసుపత్రి పాలయిన విషయం తెలిసిందే. బులంద్ షహర్ జిల్లా జీత్ గఢీ గ్రామంలో స్థానికంగా ఓ వ్యక్తి కొంతకాలంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నాడు. ఈమేరకు గత బుధవారం రాత్రి అతని వద్ద మద్యం కొనుగోలు చేసి తాగిన కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఐదుగురు చనిపోయారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీత్ గఢీ ప్రాంతంలో అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నప్పటికీ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నప్పటికీ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు సీనియర్ ఎక్సైజ్ అధికారులను పదవుల నుంచి తొలగించారు.