Begin typing your search above and press return to search.
రఫేల్ ఎందుకంత మొనగాడో చెప్పే కీలక పాయింట్లు ఇవే
By: Tupaki Desk | 11 Sept 2020 11:15 AM ISTప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే యుద్ధ విమానంగా పేర్కొనే రఫేల్ తాజాగా భారత వాయుసేనలో అధికారికంగా చేరిపోయింది. ఈ మధ్యన ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఐదు రఫేల్ యుద్ధ విమానాల్ని తాజాగా అంబాలా ఎయిర్ బేస్ లో లాంఛనంగా ప్రవేశ పెట్టారు. మిగిలిన యుద్ధ విమానాలతో పోలిస్తే.. రఫేల్ లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? మిగిలిన యుద్ధ విమానాల కంటే ఇదెందుకంత భిన్నమైనదన్న విషయాన్ని సిం‘ఫుల్’ గా చెప్పేస్తే..
- రఫేల్ అంటే గాలి దుమారం.. జ్వాలా విస్ఫోటనం అని అర్థం
- భూమికి 60 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం దీని సొంతం.
- శత్రువుల నుంచి తప్పించుకునేలా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టం ఇందులో ఉంటుంది
- రెండు ఎమ్ 88-2 ఇంజిన్లు కలిగి ఉంటుంది
- గంటకు 1389 కి.మీ. వేగంతో పయనించే సామర్థ్యం దీని సొంతం
- గాల్లోనే ఇంధనాన్ని నింపే వీలుంది
- నాన్ స్టాప్ గా 3700 కి.మీ. వరకు ఎక్కడా ఆగకుండా ప్రయాణించే సత్తా ఉంది
- దాదాపు 25 వేల కేజీల సామాగ్రిని మోసే సామర్థ్యం ఉంది
- దృశ్య పరిధి దాటి ఉన్న లక్ష్యాన్ని కూడా చేధించేస్తుంది
- ఒకేసారి ఎనిమిది టార్గెట్లను గురి పెట్టగలదు
- స్కాల్ప్ మిస్సైల్స్.. ఆరు ఏఏఎన్ఎం మిస్సైల్ రఫెల్ కు అమర్చి ఉంటాయి
- లేహ్ లాంటి ప్రాంతాల్లోనూ ల్యాండింగ్ కు.. టేకాఫ్ ను ఇట్టే చేసుకోగలదు
- హలో గ్రాఫిక్ కాక్ పిట్ డిస్ ప్లే
- మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ కు చెందిన దసో ఏవియేషన్ ఉత్పత్తి చేసింది. ఇందుకోసం భారత్ రూ.59వేల కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతానికి ఐదు రఫేల్ యుద్ధ విమానాలు జులై 29 నాటికి చేరుకుంటే.. మరో ఐదు నవంబరుకు దేశానికి రానున్నాయి.