ఇటలీలో డాలర్ కే ఇల్లు.. కాకపోతే ఇవి పాటించాల్సిందే!

Fri Jul 17 2020 06:00:01 GMT+0530 (IST)

1 Dollar Houses in Italy

మానవుడికి తిండి.. గుడ్డ ఎంత ముఖ్యమో గూడు కూడా అంతే ముఖ్యం. జీవితంలో ఒక ఇంటికి యజమాని కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇల్లు ఉండడానికే కాదు వ్యక్తి చిరునామా చెప్పడానికి ఓ ప్రూవ్ గా నిలుస్తుంది. అయితే ఇప్పుడు ఇల్లు కొనాలంటే ఒక తరం కాని పరిస్థితి ఉంది. భారీగా ధరలు పెరిగిపోతుండడంతో పేదలు.. మధ్య తరగతి ప్రజలు కొనలేని స్థితికి చేరింది. అయితే ఒక్క డాలర్ కే ఇల్లు లభిస్తే ఎంత బాగుంటుందో కదా. అలాంటి అవకాశమే ఇటలీ దేశం ఇస్తోంది. ఒక్క డాలర్ కే ఇల్లు అమ్ముతున్నట్లు ఆ దేశ ప్రభుత్వం. కాకపోతే కొన్ని నిబంధనలు.. షరతులు ఉన్నాయి. వాటిని పాటిస్తే చాలు. ఎంతకీ ఏమిటవి.. ఎందుకు అంత తక్కువకు ఇల్లు విక్రయిస్తున్నారో తెలుసుకోండి.ఇటలీలోని చిక్వాఫ్రాండీ అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో ఉన్న వారంతా పట్టణాలకు వలస వెళ్లారు. ఇల్లువాకిలి వదిలేసి పట్టణాలకు వలస వెళ్లడంతో ఆ ఊరంతా ఖాళీ అయ్యాయి. కేవలం భవనాలు మాత్రమే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ ఊరిలో ఉన్న భవనాలు.. ఇళ్లు వృథాగా పడి ఉన్నాయి. శిథిలమవుతుండడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ఇళ్లన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విక్రయానికి పెట్టింది. ఒక్క డాలర్ కే ఇల్లు విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే కొన్ని నిబంధనలు విధించింది.

- ఇల్లు కొన్నవారు అక్కడే స్థిర నివాసం ఏర్పాటుచేసుకోవాలి.
-  కొన్న తర్వాత ఆ ఇంటిని బాగు చేసుకోవాలి. లేదంటే పునఃనిర్మించుకోవాలి.
- అంతవరకు ఏడాది పాటు రూ.21 వేల వరకు బీమా చేసుకోవాలి.
- మూడేళ్లలోపు ఇంటిని బాగు చేసుకోకపోతే రూ.17 లక్షలు జరిమానాగా చెల్లించాలి.
- దీనికి ఆపరేషన్ బ్యూటీ అని పేరు పెట్టారు. దీని ఉద్దేశం గ్రామాలన్నీ మళ్లీ ప్రజలతో కళకళలాడాలని ప్రభుత్వం భావిస్తోంది.
- ఈ ఆపరేషన్ విజయవంతమైతే మరికొన్ని చోట్ల ఈ విధానం అమలు చేసే అవకాశం ఉంది.