Begin typing your search above and press return to search.

భారత పౌరసత్వాన్ని వదులుకున్న 1,83,741 మంది

By:  Tupaki Desk   |   9 Dec 2022 2:52 PM GMT
భారత పౌరసత్వాన్ని వదులుకున్న  1,83,741 మంది
X
భారత్ వద్దు.. విదేశాలే ముద్దు అని.. ఇక్కడ ఎదిగిన వారంతా పయనమవుతున్నారు. విమానాలు ఎక్కి అగ్రరాజ్యాలకు ఎగిరిపోతున్నారు. భారత్ లో పుట్టి.. భారత్ లో పెరిగి పెద్దై కావాల్సినంత విజ్ఞానాన్ని ఇక్కడ సంపాదించుకొని విదేశాల కోసం వాటిని వినియోగిస్తున్నారు. కోట్లు సంపాదనే ధ్యేయంగా దేశం దాటేస్తున్నారు. వ్యక్తిగత సుఖం తప్ప దేశం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కెరీర్ ముఖ్యమని వెళ్లిపోతున్నారు. గత కొన్నేళ్లుగా పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

2017లో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య 1,33,049 కాగా, ఐదేళ్ల తర్వాత అక్టోబర్ 31 వరకు ఈ ఏడాది మొత్తం 1,83,741 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు.

విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ శుక్రవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో అందించిన సమాచారం ప్రకారం.. 2015లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య 1,31,489గా ఉంది. 2016లో 1,41,603.. 2017లో 1,33,049.. 2018లో 1,34,561; 2019లో 1,44,017; 2020లో 85,256 , 2021లో 1,63,370 మంది ఉండడం షాకింగ్ గా మారింది.

గత కొన్నేళ్లుగా భారత పౌరసత్వం తీసుకున్న బంగ్లాదేశ్, పాకిస్థాన్ , ఆఫ్ఘనిస్తాన్ మినహా విదేశీ పౌరుల సంఖ్య గురించి కూడా లిఖితపూర్వక సమాధానం తెలిపింది.

"మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత పౌరసత్వం తీసుకున్న విదేశీ పౌరుల సంఖ్య 93 (2015లో), 153 (2016లో), 175 (2017లో), 129 (2018లో). ), 113 (2019లో), 27 (2020లో), 42 (2021లో) , 60 (2022లో) మాత్రమేనని ప్రభుత్వం పేర్కొంది.

అయితే ఈ లెక్కలు అధికారికం మాత్రమే. విదేశాల నుంచి భారత్ లోకి అక్రమంగా వచ్చే వారు లక్షల్లోనే ఉంటారు. ఇక్కడ పదిరోజులు ఉంటే చాలు ఆధార్ కార్డ్ పుట్టియ్యవచ్చు. అందుకే పౌరసత్వం కోసం అధికారికంగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసే వారి సంఖ్య ఎప్పుడూ బయటపడదు. చాలా మంది దేశంలోకి చొరబడి ఇక్కడి వారిగానే బతికేస్తారు. వారి లెక్కలు తీస్తే జనాభా భారీగానే ఉంటుంది. వెళ్లే వారు లక్షల్లో ఉన్నట్టే.. వచ్చిన వారు కూడా ఉంటారు. కానీ ఆ లెక్క ఉంది.. ఈ లెక్క లేదు అంతే తేడా..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.