Begin typing your search above and press return to search.

1,2,3 ... ర్యాంకులతో దూసుకుపోతున్న ఇండియా !

By:  Tupaki Desk   |   4 May 2021 12:30 PM GMT
1,2,3 ... ర్యాంకులతో దూసుకుపోతున్న ఇండియా !
X
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ర్యాంకింగ్స్‌ లో టీమిండియాకు మూడు ఫార్మాట్లకు అనుగుణంగా మూడు ర్యాంక్‌ లు అందుకుంది. టెస్ట్‌ ల్లో కోహ్లీసేన అగ్రస్థానంలో ఉండగా.. టీ20ల్లో రెండో ర్యాంకు లో కొనసాగుతుంది. ఇక వన్డే ఫార్మాట్‌ లో మాత్రం మూడో స్థానానికి దిగజారింది. సోమవారం ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌ ను విడుదుల చేసింది. టెస్టు ఫార్మాట్‌ లో భారత్ 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్‌ 118, ఆస్ట్రేలియా 113 పాయింట్లతో రెండు, మూడు స్థానాలను సొంతం చేసుకున్నాయి. మరోవైపు టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ 277 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. టీమిండియా 272 పాయింట్లతో రెండో స్థానం, 263 పాయింట్లతో న్యూజిలాండ్‌ మూడో స్థానంలో నిలిచాయి. ఇంగ్లండ్‌ పై 2-3తో సిరీస్ గెలవడం టీమిండియా ర్యాంక్ మెరుగుపడటానికి ఓ కారణంగా చెప్పవచ్చు.

ఇక పాకిస్థాన్‌ తో మూడు మ్యాచ్‌ ల సిరీస్‌ ను 1-1తో డ్రా చేసుకున్న ఇంగ్లీష్ టీమ్‌ కు ఆస్ట్రేలియా 2-1తో, సౌతాఫ్రికాపై 3-0తో సిరీస్ గెలవడం కలిసొచ్చింది. వెస్టిండీస్, పాక్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ పై సిరీస్‌లు నెగ్గిన న్యూజిలాండ్, ఐదో ప్లేస్ నుంచి మూడో ర్యాంకుకు ఎగబాకింది. శ్రీలంక, బంగ్లా 8, 9వ ర్యాంకుల్లో నిలవగా , విండీస్ పదో ర్యాంక్‌ లో కొనసాగుతుంది. ఇక వన్డేల్లో న్యూజిలాండ్‌ 121 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 118, టీమిండియా 115 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. ఇంతకుముందు రెండో స్థానంలో ఉన్న భారత జట్టు ఇప్పుడు ఒక స్థానం కిందకు పడిపోయింది. బంగ్లాదేశ్‌ పై 3-0తో సిరీస్ గెలవడం కివీస్‌ కు టాప్ ర్యాంక్ దక్కేలా చేసింది. ఇంగ్లండ్ ఫోర్త్‌ ప్లేస్‌ కు పడిపోయింది