Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: స‌రోవ‌రంలో హంస రాణి

సీక్విన్డ్ బ్లౌజ్ తెల్లటి చీరలో త‌న రూపం మంత్ర‌ముగ్ధం చేస్తోంది. స‌నా ధేధీప్య‌మైన మ‌నోహ‌ర‌మైన రూపం యూత్ హృద‌యాల్ని లాక్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 5:09 PM GMT
ఫోటో స్టోరి: స‌రోవ‌రంలో హంస రాణి
X

తెల్ల చీర‌.. తెల్ల బ్లౌజులో త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించింది ఫాతిమా స‌నా షేక్. తెల్ల‌గా మెరిసిపోతున్న మంచి ముత్యాలు.. తెలుగు రంగు క్రిస్ట‌ల్స్ అల్లిక‌..ల‌తో స‌నా కోసం డిజైన్ చేసిన ఈ ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ శారీ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంద‌మైన క్రిస్ట‌లైన్ చీర‌లో స‌నా షేక్ అందం హంస‌రాణిని త‌ల‌పిస్తోందంటూ పొగిడేస్తున్నారు. హంస‌ల దీవి నుంచి దారి త‌ప్పిపోయి వ‌చ్చిందా? స‌రోవ‌రం నుంచి అదుపు త‌ప్పి వ‌చ్చిందా? అంటూ కుర్రాళ్లు స‌ర‌దాగా కామెంట్ చేస్తున్నారు.


ఫాతిమా సనా షేక్ న‌టించిన 'ధక్ ధక్' ఇటీవల విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయితే ఈ స్పంద‌న‌ల‌కు వెర‌వ‌క త‌న సినిమాని చురుగ్గా ప్రమోట్ చేస్తోంది. అయితే ఈ ప్ర‌మోష‌న్స్ లో స‌నా షేక్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్న తీరుకు అభిమానులు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. అంత అందంగా స‌నా షేక్ డ్రెస్స‌ప్ అయి వేదిక‌ల‌ను అలంక‌రిస్తోంది. ఇటీవలి ప్రచార కార్యక్రమంలో, ఫాతిమా తన సహజసిద్ధమైన అందం, శైలిని ప్రతిబింబించే అద్భుతమైన ఫోటోషూట్ తో మంత్రముగ్ధులను చేసింది. సీక్విన్డ్ బ్లౌజ్ తెల్లటి చీరలో త‌న రూపం మంత్ర‌ముగ్ధం చేస్తోంది. స‌నా ధేధీప్య‌మైన మ‌నోహ‌ర‌మైన రూపం యూత్ హృద‌యాల్ని లాక్ చేస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ధ‌క్ ధ‌క్ తర్వాతా స‌నా షేక్ న‌టించిన సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. విక్కీ కౌశల్‌తో కలిసి 'సామ్ బహదూర్'లోను స‌నా షేక్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది బయోగ్రాఫికల్ డ్రామా. నిజ జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కింది. ఇందులో స‌నా త‌న న‌ట‌న‌కు పేరొస్తుంద‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో సామ్ బ‌హ‌దూర్ కి ప్రచారం సాగిస్తోంది.

అమీర్ ఖాన్‌తో స్నేహం:

అమీర్ ఖాన్ త‌న రెండో భార్య‌ కిరణ్ రావు నుండి విడిపోక ముందే 'దంగ‌ల్' ఫేం ఫాతిమా సనా షేక్ తో ప్రేమలో పడ్డార‌ని ప్ర‌చారం సాగింది. ఫాతిమా వ‌ల్ల‌నే ఆ ఇద్ద‌రూ విడిపోయార‌ని చాలా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. మీడియా నివేదిక‌ల ప్రకారం.. ఫాతిమా అమీర్ సన్నిహిత కుటుంబ పార్టీలకు హాజరవుతుంది. ఆమె అమీర్ కోసం సెట్స్ కి కూడా వస్తుంది. కిర‌ణ్ రావుతో విడాకులు స‌హా ఈ కొత్త ఎఫైర్ విష‌యంలో అభిమానులు అంత సంతృప్తిగా లేరన్న‌ది తెలిసిందే.