Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కాక‌లు పుట్టిస్తున్న ట్రిప్తి దిమ్రీ

By:  Tupaki Desk   |   24 Feb 2024 5:24 PM GMT
ఫోటో స్టోరి: కాక‌లు పుట్టిస్తున్న ట్రిప్తి దిమ్రీ
X

వేడిగా అందాల‌ను వ‌డ్డించ‌డంలో ట్రిప్తి దిమ్రీ త‌ర్వాతే ఎవ‌రైనా. అందుకే ర‌ష్మిక మంద‌న్న ఉండ‌గానే త‌న‌ను నేష‌న‌ల్ క్ర‌ష్ అని యూత్ పిలిచారు. యానిమ‌ల్ సినిమాతో వెలుగులోకి వ‌చ్చిన ట్రిప్తి, ఇప్ప‌టికిప్పుడు నాలుగైదు పాన్ ఇండియా సినిమాల్లో న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌భాస్ తో స్పిరిట్, కార్తీక్ ఆర్య‌న్ తో ఆషిఖి 3 , భూల్ భుల‌యా 3 వంటి చిత్రాల్లో న‌టించేస్తోంది. వీటికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌లు లేక‌పోయినా కానీ, మీడియాలో నిరంత‌రం ట్రిప్తి పేరు హెడ్ లైన్స్ లోకొస్తోంది.

అలాగే సోష‌ల్ మీడియా పోస్టుల‌తోను ట్రిప్తి నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఇటీవ‌ల ఈ బ్యూటీ వ‌రుస‌గా వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. ఈ సిరీస్ లో ఇప్పుడు కొత్త ఫోటోషూట్ అగ్గి రాజేస్తోంది. ట్రిప్తి ఇన్న‌ర్ అందాల‌ను ఎలివేట్ చేస్తూ సెన్సిబుల్ ఫోజులతో మ‌తులు చెడ‌గొట్టింది. ఒక ఫోటోలో ఇన్న‌ర్ సొగ‌సుని ఎలివేట్ చేస్తూ.. భుజాల మీదుగా ఉలెన్ కోట్ ని వేలాడ‌దీసి రెబ‌ల్ స్టైల్ లా ఫోజులిచ్చింది.

మ‌రో ఫోటోగ్రాఫ్ లో న‌డుము నాభి అందాల‌ను ఎలివేట్ చేస్తూ ట్రిప్తి ఇచ్చిన ఫోజ్ గుండెల్ని కొల్ల‌గొడుతోంది. ట్రిప్తి స‌న్న‌జాజి న‌డుముపై ప‌చ్చ‌బొట్టు క‌వ్వింత సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తోంది. బాట‌మ్‌లో వైట్ అండ్ వైట్ ట్రాక్ ని ట్రిప్తి ధ‌రించింది. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ట్రిప్తి త‌న అంద‌చందాల‌ను ఎలివేట్ చేసేందుకు ఎంత‌మాత్రం మొహ‌మాట ప‌డలేదు. ప్ర‌స్తుతం ట్రిప్తి అంద‌మైన ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.