Begin typing your search above and press return to search.

బార్బీ బొమ్మకి చెల్లెలివా.. శ్రీముఖి క్యూట్ ఫోజులు..!

బుల్లితెర హాట్ బ్యూటీల్లో శ్రీముఖి ఒకరు

By:  Tupaki Desk   |   22 July 2023 9:56 AM GMT
బార్బీ బొమ్మకి చెల్లెలివా.. శ్రీముఖి క్యూట్ ఫోజులు..!
X

బుల్లితెర హాట్ బ్యూటీల్లో శ్రీముఖి ఒకరు. మంచి అవకాశాలు రాక యాంకర్ గా ఫిక్స్ అయిపోయింది కానీ, హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోదు మన బుల్లితెర రాములమ్మ. మోడ్రన్ లుక్ నుంచి ట్రెండీ లుక్ వరకు ఏ దుస్తుల్లోనైనా మెస్మరైజ్ చేయగల సత్తా శ్రీముఖికి సొంతం. అవతల పక్క ఎంత పెద్ద సెలబ్రెటీలు ఉన్నా, ఏ మాత్రం తడపడకుండా, ధీటుగా నిలపడి సమాధానం చెప్పగలదు.


ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. టీవీ షో లో కనిపించే దుస్తులతో ఫోటో షూట్ లు చేసి షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు, తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ట్రిప్స్ కి వెళ్లినప్పుడు కూడా తన అందాన్ని కెమేరాల్లో బంధించి, ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక శ్రీముఖి పొట్టి దుస్తులు ధరించానికి, క్లీవేజ్ షో చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడదు. ప్రోగ్రామ్ కి తగినట్లు దుస్తులు ధరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం స్టార్ మాలో రెండు ముఖ్యమైన ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా చేస్తోంది. కాగా, తాజాగా ఈ హాట్ బ్యూటీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

అందులో పొట్టి గౌను వేసుకొని క్యూట్ ఫోజులు ఇచ్చింది. అచ్చం బార్బీ బొమ్మలా కనిపించడం విశేషం. లావెండర్ కలర్ ఫ్రాక్ పై గోల్డ్ కలర్ ప్రింట్ చాలా అందంగా ఉంది. డ్రెస్ కి తగినట్లు మేకప్ వేసుకుంది. బుట్ట చేతుల గౌనులో శ్రీముఖి ని చూసి ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.శ్రీముఖి యాంకరింగ్ కెరీర్ ని ఎంచుకొని చాలా కాలం అవుతోంది. ఆమెను మొదటి సారి చూసినప్పుడే అందరూ ఆమె అందానికి ఫిదా అయిపోయారు. ఇప్పటి వరకు చాలా టీవీ షోలో వ్యాఖ్యతగా వ్యవహరించింది. తన కెరీర్ ని మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు.

మధ్యలో కొన్ని సినిమాల్లోనూ నటించింది కానీ, పెద్దగా వర్కౌట్ కాలేదు. కాగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ మూవీలో నటించినట్లు సమాచారం. ఈ మూవీ విడుదలైతేనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.