Begin typing your search above and press return to search.

ఇండియన్ రియల్ హీరో టామ్ క్రూయిస్ ను గుర్తుపట్టారా

తాజాగా ఆయనకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   12 Aug 2023 8:22 AM GMT
ఇండియన్ రియల్ హీరో టామ్ క్రూయిస్ ను గుర్తుపట్టారా
X

హాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అనగానే టక్కున గుర్తొచ్చే పేరు టామ్ క్రూయిస్. భారీ యాక్షన్ చిత్రాలకు, సాహసాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్. మరి ఇండియన్ సినిమాలో అలాంటి హీరో ఎవరు అనగానే హృతిక్ రోషన్ సహా ఒకరి ఇద్దరి హీరోల పేర్లు వినిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో కొత్త పేరు వినిపిస్తోంది. ఆయనే సోనూసూద్.


ఎందుకంటే.. తాజాగా ఆయనకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. టామ్ క్రూయిస్ తరహాలో స్టైలిక్ లుక్ లో ఆయన దర్శనమిచ్చారు. అలాగే ఇతర హాలీవుడ్ హీరోస్ గెటప్ లోనూ ఆయన కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఇలా కనపడటానికి కారణం జనరేటివ్ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.


గత కొద్ది కాలంగా ఏఐ సాయంతో క్రియేట్ అవుతున్న రకరకాల చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లేదా ఇండియన్ హీరోలు.. హాలీవుడ్ కథానాయకులుగా మారితే ఎలా ఉంటుంది, దేశాధినేతలు చిన్నపిల్లలుగా ఉండే ఎలా ఉంటారు, ఇలా రకరకాలుగా ఫొటోస్ నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

అలా ఇప్పుడు సోనూసూద్ ను హాలీవుడ్ హీరో టామ్ క్రూయిస్ లా ఉంటే ఎలా ఉంటారో అంటూ ఫొటోలు దర్శనమిచ్చాయి. అలాగే జోకర్, ర్యాంబో, థోర్ సహా పలు హీరోల పాత్రల్లోనూ సోనూ ఫొటోలు కనిపించాయి. ఇవి చూసిన నెటిజన్లు లైక్స్ , కామెంట్స్ తో వాటిని తెగ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా టామ్ క్రూయిస్ స్టైల్ లో ఉన్న ఫొటోకు 'దేశీ హ్యాండ్సమ్ హంక్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ లుక్స్ కు మంచి స్పందన వస్తోంది.

ఇక సోనూసూద్ విషయానికొస్తే.. కరోనా సమయంలో వేల, లక్షల మంది సాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి సినిమాల విషయంలోనూ ఆచితూచి కథలను ఎంచుకుంటూ తెరపై కనిపిస్తున్నారు. చివరిగా 'ఆచార్య', 'సామ్రాట్ పృథ్వీరాజ్', 'తమిళరసన్' అనే చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం 'ఫాతేహ్' అనే ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నారు.