అక్కినేని కోడలు బంగారు నెమలి అవతారం
అక్కినేని కోడలు శోభిత ధూళిపాల ఫ్యాషన్ సెన్స్ అన్నివేళలా యువతరంలో హాట్ టాపిక్.
By: Tupaki Desk | 20 April 2025 11:14 AM ISTఅక్కినేని కోడలు శోభిత ధూళిపాల ఫ్యాషన్ సెన్స్ అన్నివేళలా యువతరంలో హాట్ టాపిక్. శోభిత పోటీ నాయికల కంటే ఎంపికల పరంగా అడ్వాన్స్‌డ్ గా ఉంటుంది. ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం నిండిన డిజైనర్ లుక్ తో వేదికలపై మ్యాజిక్ చేస్తోంది. ఈసారి కూడా ఈ భామ కొత్త లుక్ స్టన్నర్ గా నిలిచింది.
ఎంపిక చేసుకున్న డిజైనర్ ఫ్రాక్ అణువణువునా బంగారు మిరుమిట్లు కళ్లు జిగేల్మనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ థై స్లిట్ ఫ్రాక్ నెమలి పించాల డిజైన్ తో శోభిత అందాన్ని పదింతలు పెంచింది. శోభిత నడిచి వెళుతుంటే, నెమలి నడకను తలపిస్తోంది. బంగారు నెమలి దారి తప్పి వచ్చిందా? అన్నంత అందంగా కనిపిస్తోంది ఈ కొత్త లుక్.
దీనికి శోభిత అందమైన క్యాప్సన్ ఇచ్చింది. `గోల్డెన్ అవర్ .. కానీ దానిని కోచర్‌గా చేసుకోండి..`` అని దీనికి అందమైన శీర్షికను ఇచ్చింది. నిజానికి డిజైనర్లు ఎక్కువగా ప్రకృతి నుంచి, సముద్ర జీవుల నుంచి, పక్షులు జంతుజాలం నుంచి క్రిమి కీటకాల నుంచి కూడా స్ఫూర్తి పొంది.. దుస్తుల్ని డిజైన్ చేసామని చెబుతుంటారు. ఇప్పుడు శోభిత ఎంపిక చేసుకున్న ఈ డిజైనర్ ఫ్రాక్ కి అందమైన నెమలి లేదా ఫెదర్ తో కళకళలాడ ఏదైనా పెద్ద పక్షి స్ఫూర్తి అని భావించాలి. అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన తర్వాత శోభిత కెరీర్ పరంగా స్పీడ్ తగ్గించింది. మంకీ మ్యాన్, జిగ్రా తర్వాత సినిమాలేవీ లేవు. శోభిత ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ పై సీరియస్ గా దృష్టి సారించిందని అర్థమవుతోంది. మరోవైపు చైతన్య వరుస విజయాలతో కెరీర్ పరంగా స్పీడ్ పెంచాడు.
