Begin typing your search above and press return to search.

హాట్ హీరోయిన్ ర‌తి రేయి మ‌న్మ‌ధ బాణాలు

అందాన్ని గొప్ప‌గా ఎలివేట్ చేసే ఫోటోషూట్లు ఎన్ని ఉన్నా కానీ, బెడ్ రూమ్ ఫోటోషూట్ మాత్రం వీట‌న్నిటిలో యూనిక్.

By:  Tupaki Desk   |   8 Oct 2023 5:36 AM GMT
హాట్ హీరోయిన్ ర‌తి రేయి మ‌న్మ‌ధ బాణాలు
X

అందాన్ని గొప్ప‌గా ఎలివేట్ చేసే ఫోటోషూట్లు ఎన్ని ఉన్నా కానీ, బెడ్ రూమ్ ఫోటోషూట్ మాత్రం వీట‌న్నిటిలో యూనిక్. బికినీ బీచ్ షూట్.. పూల్ సైడ్ షూట్.. జిమ్ యోగా షూట్.. ఇలా వెరైటీలు ఎన్ని ఉన్నా ప‌డ‌క గ‌దిలో మ‌గువ విలాపానికి సంబంధించిన ఫోటోషూట్ అన్నివేళ‌లా క్యూరియాసిటీ పెంచుతుంది. యూత్ గుండెల్లో ర‌తి రేయి మ‌న్మ‌ధ బాణాలు గుచ్చేస్తుంది అంతే.

ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ ముంబై మోడ‌ల్ కం హాట్ హీరోయిన్ బెడ్ రూమ్ విన్యాసాలు గుబులు రేపుతున్నాయి. కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని స్పెష‌ల్ ట్రీట్ ఇది. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే మ‌ధుర్ భండార్క‌ర్ కేలెండ‌ర్ గ‌ర్ల్స్ తో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన టాప్ మోడ‌ల్ రూహీ సింగ్ గురించే ఇదంతా.

రూహీ సింగ్ త‌న‌లోని హాట్ కంటెంట్ ని ఎలివేట్ చేయ‌డంలో అన్నివేళలా ట్రెండ్ సెట్ట‌ర్ గా క‌నిపిస్తోంది. ఈ భామ ఇటీవ‌ల‌ టీవీ షోలలో క‌నిపిస్తోంది. ఫ్యాషన్ ఈవెంట్ల‌లోను రూహీ స్ట‌న్నింగ్ అప్పియ‌రెన్సుల‌కు యూత్ ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా క్వీన్ గాను రూహీ తన ప్రజాదరణను వివిధ వేధిక‌ల‌పై ఎంతో తెలివిగా ఉపయోగించుకుంటుంది. తాజాగా రూహీ షేర్ చేసిన ఫోటోల‌కు లవ్ హార్ట్ ఎమోజీలు కురుస్తున్నాయి. ది స్టన్నింగ్ లుక్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. క్యాలెండ‌ర్ గ‌ర్ల్ చిత్రంతో కెరీర్ ప్రారంభించి ఇష్క్ ఫ‌రెవ‌ర్.. బొంగు.. ఆప‌రేష‌న్ కోబ్రా స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించింది. తెలుగులో మంచు విష్ణు మోస‌గాళ్లు చిత్రంలోను రూహీ న‌టించింది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ సినిమా ఫ్లాపైంది. గ‌త ఏడాది ఆగ‌స్టులో రుహీ సింగ్ నెట్ ఫ్లిక్స్ షో సోషల్ కరెన్సీ స్ట్రీమింగ్ అయింది. భారతదేశంలోని అగ్రశ్రేణి సెల‌బ్రిటీల్లో ఎనిమిది మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ లు తమ వ్యక్తిగత ఫోన్ లు..వెరిఫైడ్ హ్యాండిల్స్ .. ఆన్ లైన్ ఫాలోయింగ్ తో సంబంధం లేకుండా 21 రోజుల పాటు పోటీపడే షో ఇది. రూహీ ఈ షోలో ఒక బాస్ లేడీగా అత్యంత శక్తివంతమైన ప్రభావశీలిగా న‌టించింది.