Begin typing your search above and press return to search.

ఫొటో టాక్: ప్రణీత స్టన్నింగ్ గ్లామర్ డోస్

ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ ప్రణీత సుభాష్.

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:51 PM GMT
ఫొటో టాక్: ప్రణీత స్టన్నింగ్ గ్లామర్ డోస్
X

ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ ప్రణీత సుభాష్. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, జూనియర్ ఎన్టీఆర్ రభస సినిమాలలో ప్రణీత నటించింది. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ గా మాత్రం ఈ బ్యూటీ సక్సెస్ కాలేకపోయింది. మాతృభాష కన్నడంలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

పోకిరి రీమేక్ ద్వారా కన్నడంలోకి హీరోయిన్ గా ప్రణీత ఎంట్రీ ఇచ్చింది. 2021లో ఈ బ్యూటీ పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. అయితే పెళ్లి తర్వాత కూడా నటిగా సినిమాలు చేస్తూనే ఉంది. హిందీలో హంగామా2తో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కన్నడంలో ఒకటి మలయాళంలో ఒక మూవీ సెట్స్ పైన ఉన్నాయి. తెలుగులో చివరిగా హలో గురు ప్రేమకోసమే చిత్రంలో ప్రణీత గెస్ట్ రోల్ లో కనిపించింది.

సినిమాలలో ఛాన్స్ లు తగ్గిన సోషల్ మీడియా ద్వారా మాత్రం ప్రణీత అందరికి అందుబాటులో ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. అలాగే హాట్ హాట్ ఫోటోలని ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ప్రణీతకి ఏడాది వయసున్న కూతురు కూడా ఉంది.

కూతురుతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఆ వీడియోలని కూడా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ నడుము అందాలు కనిపించే విధంగా స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని గ్లామర్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఈ ఫోటోతో కుర్రాళ్ళకి వేడి పుట్టిస్తోంది.

కరెక్ట్ గా దృష్టి పెడితే ఇప్పటికి హీరోయిన్ గా కొనసాగేంత ఫీచర్స్ ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు హాట్ అంటూ ఎమోజీలు కూడా పెడుతూ ఉండటం విశేషం. ప్రణీత సుభాష్ అందాలని అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ ఫోటోని ఏకంగా 72,617 మంది వీక్షించడం విశేషం.