Begin typing your search above and press return to search.

బోల్డ్ బ్యూటీ పూన‌మ్ హొయ‌లు చూడ‌త‌ర‌మా?

By:  Tupaki Desk   |   13 Aug 2023 7:59 AM GMT
బోల్డ్ బ్యూటీ పూన‌మ్ హొయ‌లు చూడ‌త‌ర‌మా?
X

పూన‌మ్ బ‌జ్వా.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌వ‌దీప్ - మొద‌టి సినిమా.. నాగార్జున -బాస్ చిత్రాల్లో న‌టించింది. అయితే టాలీవుడ్ లో ఈ అమ్మ‌డికి ఏమాత్రం ల‌క్ ఫేవ‌ర్ చేయ‌లేదు. అదే క్ర‌మంలో త‌న మాతృప‌రిశ్ర‌మ మ‌ల‌యాళంలో న‌టిగా సెటిలైంది. అక్క‌డ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది. ఇక సోష‌ల్ మీడియాల్లో పూనమ్ బజ్వా స్పీడ్ గురించి తెలిసిందే. సామాజిక మాధ్య‌మాల్లో తెలుగు అభిమానుల‌కు ఈ భామ‌ ట‌చ్ లో ఉంది. నిరంత‌రం హాట్ పోటోషూట్ల‌ను వీడియోల‌ను షేర్ చేస్తూ క‌వ్విస్తోంది.


తాజాగా పూన‌మ్ బోల్డ్ బికినీ ఫోటోషూట్ ని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. బ్లాక్ టాప్.. బ్లాక్ షార్ట్ ధ‌రించి అలా పార్క్ లో కెమెరాకు ఫోజులిస్తోంది పూన‌మ్. ఈ ఫోటోల్లో నాభి అందాలు.. థై సొగ‌సుల‌ను ఎలివేట్ చేస్తోంది. షేడెడ్ గ్లాసెస్ ధ‌రించి చిరున‌వ్వులు చిందిస్తూ పూన‌మ్ హొయ‌లు పోతున్న ఫోటోలు ప్ర‌స్తుతం వెబ్ లో వైర‌ల్ గా మారాయి. ``ఎరోల్ ఓజాన్ కోల్పోకుండా కొన్ని అందమైన మార్గాలను కనుగొనలేము`` అంటూ ఈ ఫోటోల‌కు వ్యాఖ్య‌ను జోడించింది. పూన‌మ్ బ‌జ్వా నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ అంటూ అభిమానులు వీటిని వెబ్ లో వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.


తెలుగులో` మొద‌టి సినిమా`తో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన బ‌జ్వా అటు పై నాగార్జున బాస్ చిత్రంలో న‌టించింది. ఇవి రెండూ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపుల‌య్యాయి. దాంతో కెరీర్ ప‌రంగా ఏ ద‌శ‌లోనూ బిజీ అవ్వ‌లేదు. ఎన్బీకే న‌టించిన‌ `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు` చిత్రంతో టాలీవుడ్ లోకి కంబ్యాక్ అయిన పూన‌మ్ బ‌జ్వా.. ఆ త‌ర్వాత పెద్ద కెరీర్ ని ఆశించింది. కానీ ఏదీ క‌లిసి రాలేదు. 2022లో పూన‌మ్ న‌టించిన రెండు సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇందులో ఒక‌టి మ‌ల‌యాళ చిత్రం కాగా ఒక‌టి త‌మిళ చిత్రం. కానీ ఇవి కూడా విజ‌యం సాధించ‌లేదు.