Begin typing your search above and press return to search.

నాభి సొగ‌సును ఆరాంగా చూపించేస్తోంది!

పూన‌మ్ బ‌జ్వా నిరంత‌ర ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Oct 2023 10:29 AM GMT
నాభి సొగ‌సును ఆరాంగా చూపించేస్తోంది!
X

పూన‌మ్ బ‌జ్వా నిరంత‌ర ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో ఈ భామ రొటీన్ కి భిన్నంగా ట్రెండీ లుక్స్ తో క‌ట్టి ప‌డేస్తోంది. బికినీ..టూపీస్.. యోగా..జిమ్ముల్లో వ‌ర్కౌట్ వీడియోలు ఫోటోల‌తో కుర్ర కారుని హీటెక్కించే ఈ భామ పొట్టినిక్క‌ర‌ల్లో చెల‌రేగిపోవ‌డం చూస్తున్న‌దే. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి ఇన్ స్టా వేదిక‌గా ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. బ్లూటాప్, ఫ్లోరల్ బాట‌మ్ లో బ‌జ్వా అద‌ర‌గొట్టింది. ఫోటోషూట్ ఆద్యంతం ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో ఫోజులిచ్చిన ఈ భామ త‌న‌ నాభి అందాల్ని ఆరాంగా తెర‌ప‌రిచింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. నాభి అందాలు..న‌డుము ఒంపు సొంపుల‌ ఎలివేష‌న్ మతులు చెడ‌గొడుతోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పూన‌మ్ అందాల‌పై నెటిజ‌నులు కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. ఇటీవ‌ల కాలంలో పూన‌మ్ అప్ డేట్ చూస్తుంటే ఇన్ స్టాలో యాక్టివ్ నెస్ ని స్పీడ‌ప్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఏదో ఒక‌ హాట్ ఫోటోషూట్ తో ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ లో పూన‌మ్ థైషోస్ మేక‌ప్ లెస్ లుక్ పైనా ర‌క‌ర‌కాల కామెంట్టు ప‌డిపోతున్నాయ్. పూన‌మ్ హాట్ గా ఉందంటూ ప‌లువురు నెటిజ‌నులు కామెంట్ చేసారు.

పూన‌మ్ కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే ప్రస్తుతం మ‌లాయ‌ళంలో `పాతోన్ పాత‌మ్ నుట్టానుండ్` అనే ఒకే సినిమాలో న‌టిస్తోంది. ఇది చ‌రిత్ర నేప‌థ్యంతో కూడిన సినిమా. భారీ బ‌డ్జెట్ తోనే తెర‌కెక్కిస్తున్నారు. తెలుగులో పూన‌మ్ మొదటి సినిమాతో న‌టిగా ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత ప‌రుగు , ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రాల్లో న‌టించింది. అలాగే ప‌లు మీడియం బడ్జెట్ సినిమాల్లోనూ న‌టించింది. కానీ ఇక్క‌డ అనుకున్నంత స్టార్ డ‌మ్ చిక్క‌లేదు. దీంతో ఇత‌ర భాషా చిత్రాల‌పై దృష్టి పెట్టింది. త‌మిళ్, క‌న్న‌డ భాష‌ల్లోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే మాతృభాష హిందీలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క సినిమా కూడా చేయ‌లేదు.