Begin typing your search above and press return to search.

పరిణితీ చోప్రా వీకెండ్ ట్రీట్.. ఎర్ర మిర్చి ఘాటులా

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎనర్జిటిక్ యాక్ట్రెస్‌గా, ప్రియాంక చోప్రా సోదరిగా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది పరిణితి చోప్రా.

By:  Tupaki Desk   |   27 Aug 2023 12:32 PM GMT
పరిణితీ చోప్రా వీకెండ్ ట్రీట్.. ఎర్ర మిర్చి ఘాటులా
X

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎనర్జిటిక్ యాక్ట్రెస్‌గా, ప్రియాంక చోప్రా సోదరిగా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది పరిణితి చోప్రా. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. అదిరిపోయే ఫోటో షూట్లతో నెట్టింట్లో ట్రెండ్‌ అవుతుంటుంది. అలాగే కుర్రాళ్ల మతిపోగొడుతుంటుంది. అభిమానులు ఆమె అందాలకు ఫిదా అవుతుంటారు.


అయితే ఈ ముద్దుగుమ్మ గత కొద్ది కాలంగా సోషల్ మీడియా, టెలివిజన్ మీడియాలో మరింత ఎక్కువ హాట్ టాపిక్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె త్వరలోనే రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దాను పెళ్లి చేసుకోబోతోంది. ఇప్పటికే ఈ సెలబ్రిటీల ఎంగేజ్‌మెంట్‌ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఇక పెళ్ళిని కూడా అంతకన్నా గ్రాండ్ గా చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.


అయితే డిన్నర్ డేట్ లు, వెకేషన్లు అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. ఎంగేజ్ మెంట్ తర్వాత ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. అయితే ఓ పక్క పెళ్లి పనులు, ఆధ్యాత్మిక యాత్రలతో బిజీగా ఉన్న.. సోషల్ మీడియాలో మాత్రం తరచూ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది పరిణితి. ఇప్పుడు తాజాగా మరోసారి రెడ్ కలర్ డిఫరెంట్ మోడల్ ఔట్ ఫిట్స్ లో ఫొటోలకు పోజులిచ్చింది. బ్రిడల్ ఆసియా మ్యాగ్జైన్ కవర్ పేజీల కోసం ఈ ఫొటోషూట్ చేసింది.


మొదటి ఫొటోలో డిజైన్డ్ లెహంగా, కాస్ట్లీ జ్యూవెలరీ ధరించి మెస్మరైజ్ చేసింది. రెండో పిక్ లో లాంగ్ ట్రెండీ పార్టీ వేర్ డ్రెస్ లో ఎర్రటి గులాబి పువ్వులా ధగధగ మెరిసిపోయింది. మూడో ఫొటోలో రెడ్ కలర్ ప్రింటెండ్ కుర్తా, ప్యాంట్ తో కూర్చొని పోజు ఇస్తూ ఆకట్టుకుంది. ఇక నాలుగో పిక్ లో మోడ్రన్ మెరూన్ కలర్ డిజైన్డ్ డ్రెస్ ధరించి తన చూపులతో ఫిదా చేసింది. ఇలా ఒక్కో ఫొటోల ఒక్కో ట్రెండీ మోడ్రన్ డిజైన్డ్ డ్రెస్, కాస్ట్లీ జ్యూవెలరీ ధరించి అభిమానులను గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.


ఇకపోతే ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా 2022లో కోడ్ నేమ్ తిరంగ, ఊంచాయి చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ, అమర్ సింగ్ చమ్కీలా చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే ఇవి రిలీజ్ కానున్నాయి.