Begin typing your search above and press return to search.

స్వయంబు సమరయోధుడిగా నిఖిల్.. స్టన్నింగ్ లుక్

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా ఈ మధ్యకాలంలో తనను తాను చాలా చేంజ్ చేసుకుంటున్నాడు అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   18 Aug 2023 4:48 AM GMT
స్వయంబు సమరయోధుడిగా నిఖిల్.. స్టన్నింగ్ లుక్
X

సినిమా సినిమాకు కొత్తగా కనిపించకపోతే ఈ రోజుల్లో ఏ హీరో అయినా సరే ఊహించని విధంగా డౌన్ ఫాల్ అవుతున్నాడు. అందుకే యువ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరు కూడా ప్రేక్షకులకు కొత్తగా అనిపించేలా క్యారెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక యువ హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా ఈ మధ్యకాలంలో తనను తాను చాలా చేంజ్ చేసుకుంటున్నాడు అని చెప్పాలి.

ముఖ్యంగా అతను ఒకవైపు కమర్షియల్ లవ్ స్టోరీలను చేస్తూనే మరొకవైపు ఊహించిన విధంగా డిఫరెంట్ త్రిల్లర్ సినిమాలను టచ్ చేస్తూ వస్తున్నాడు. కార్తికేయ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత 18 పెజెస్ తో తో కూడా పరవాలేదు అనిపించాడు. అయితే మళ్లీ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవాలి అని చాలా బలంగా సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం స్వయంభు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇది నిఖిల్ కు 20వ సినిమా కావడం విశేషం. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

స్వయంభూ అనే టైటిల్ ఒక్కటే చాలా ఉత్సుకతను రేకెత్తించగా ఇప్పుడు టైటిల్ పోస్టర్ తో మరింత హైప్ పెంచేశారు. నిఖిల్‌ను పవర్ఫుల్ యోధుడిగా కనిపిస్తున్న ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. నెవ్వర్ బిఫోర్ అనేలా నిఖిల్ సరికొత్త అవతారంలోకి వచ్చేశాడు. గ్రాండ్ లాంచింగ్ వేడుకను నిర్వహించడానికి మేకర్స్ శ్రావణ శుక్రవారం శుభ సందర్భాన్ని ఎంచుకున్నారు. చిత్రబృందం మొత్తం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది.


ఈరోజు సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. నిఖిల్ యోధుడిగా గుర్రపు స్వారీ చేస్తూ డ్రాగన్‌పై బాణం వేస్తున్నట్లు కనిపించిన ఈ స్టప్‌ఫైయింగ్ పోస్టర్ ద్వారా ప్రకటన వెలువడింది. ఇక నిఖిల్ గెటప్ నుండి అతని కాస్ట్యూమ్స్ వరకు చూస్తూ ఉంటే సినిమాలో అతను సరికొత్తగా ఆకట్టుకోబోతున్నట్లు చెప్పవచ్చు. ఇక నిఖిల్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇక సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.