Begin typing your search above and press return to search.

మృణాల్ ఆల్వేస్ మెస్మరైజింగ్..!

సీతారామం ముందు వరకు మృణాల్ ఒక బాలీవుడ్ లో ఒక సగటు హీరోయిన్ మాత్రమే కానీ ఎప్పుడైతే సీతారామం హిట్ అయ్యిందో ఆమె రేంజ్ మారిపోయింది.

By:  Tupaki Desk   |   23 July 2023 9:31 AM GMT
మృణాల్ ఆల్వేస్ మెస్మరైజింగ్..!
X

సీతారామం ముందు వరకు మృణాల్ ఒక బాలీవుడ్ లో ఒక సగటు హీరోయిన్ మాత్రమే కానీ ఎప్పుడైతే సీతారామం హిట్ అయ్యిందో ఆమె రేంజ్ మారిపోయింది. ఆ ఒక్క సినిమాతో మృణాల్ కి తెలుగులో స్టార్ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. హను రాఘవపుడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఇద్దరు తమ పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలిచారు. సినిమా హిట్ పడితే వరుస అవకాశాలు రావడం కామన్ అలానే మృణాల్ ఇప్పటికే రెండు క్రేజీ సినిమాలతో హంగామా చేస్తుంది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్న తన సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కూడా మృణాల్ రచ్చ చేస్తుంది. మృణాల్ ఠాకూర్ ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్లి చూస్తే చాలు అమ్మడు ఏ రేంజ్ లో గ్లామర్ ట్రీట్ అందిస్తుందో అర్థమవుతుంది. సినిమాల్లో క్లాస్ ఇమేజ్ తో కూల్ లుక్స్ తో అలరిస్తున్న మృణాల్ ఫోటో షూట్స్ లో మాత్రం తన హాట్ అటెంప్ట్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. లేటెస్ట్ గా మృణాల్ బ్లాక్ అండ్ బోల్డ్ లుక్స్ తో మరోసారి ఫాలోవర్స్ ని అలరించింది. బ్లాక్ టాప్ తో నెట్టెడ్ ఇన్నర్ తో తన చూపులతోనే కుర్రాళ్లని మాయలో పడేస్తుంది అమ్మడు.

నటిగా తను చేసే పాత్రలతో మెప్పిస్తున్న మృణాల్ గ్లామర్ షోలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా అమ్మడు రెచ్చిపోతుంది. సిల్వర్ స్క్రీన్ పై తన మెస్మరైజ్ చేస్తున్న మృణాల్ తన సోషల్ మీడియా ఫోటో షూట్ లు కూడా తన గ్రాఫ్ పెంచేందుకు సహకరిస్తుంది. మృణాల్ ప్రస్తుతం నాని హాయ్ నాన్న సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ పరశురామ్ సినిమాలో కూడా మృణాల్ నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా ఆమెకు తప్పకుండా తన ఇమేజ్ పెంచేలా ఉంటుందని తెలుస్తుంది.


ఈమధ్య హీరోయిన్స్ అంతా కూడా సినిమాలతో సంబంధం లేకుండా తమ ఫోటో షూట్స్ తోనే హంగామా చేస్తున్నారు. సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే స్టార్ రేంజ్ తెచ్చుకున్న మృణాల్ రాబోయే సినిమాలతో కూడా అదే ఫాం కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి. నాని, విజయ్ లతో చేస్తున్న సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ పడినా సరే మృణాల్ గ్రాఫ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అటు సినిమాలు, ఇటు ఫోటో షూట్స్ అన్నీ కూడా మృణాల్ ని ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేస్తుంది.