Begin typing your search above and press return to search.

ఎంపీ గారి గ్లామర్ ట్రీట్.. స్టన్నింగ్!

సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.

By:  Tupaki Desk   |   16 July 2023 1:38 PM GMT
ఎంపీ గారి గ్లామర్ ట్రీట్.. స్టన్నింగ్!
X

సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అయితే అలా వెళ్ళిన తర్వాత హీరోయిన్స్ గ్లామర్ ప్రపంచానికి మెల్లమెల్లగా దూరమవుతూ ఉంటారు. అలాగే మంచి క్యారెక్టర్ ఎంతో నచ్చితే గాని యాక్టింగ్ చేయరు. అయితే సినీ తారలు అయినా కూడా పొలిటికల్ యాంగిల్ కు దగ్గరగా ఉండేలా ఫోటోషూట్స్ లో పాల్గొనడం సర్వసాధారణం.

కానీ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఒక మాజీ హీరోయిన్ ఇప్పటికే గ్లామర్ తో కుర్రాళ్ళ మనసును దోచేస్తోంది.

2019 నుంచి లోక్ సభ సభ్యురాలుగా కొనసాగుతున్న మిమీ చక్రవర్తి సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు స్టన్ అయ్యేలా దర్శమిస్తోంది. మేడమ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ కాలమే అయినప్పటికీ కూడా కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా టెలివిజన్ ప్రపంచంలో కూడా మంచి గుర్తింపు అయితే దక్కించుకున్నారు.


మోడల్ గా మొదట క్రేజ్ అందుకున్న తర్వాత ఆమెకు బెంగాలీ సినిమా ప్రపంచంలో అవకాశాలు వచ్చాయి. ఇక అక్కడ 2019 వరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేసింది. ఇక టెలివిజన్ ప్రపంచంలో కూడా ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే పొలిటికల్ గా ప్రపంచంలోకె అడుగుపెట్టి చాలా వేగంగానే ప్రజల్లో ఆదరణను పెంచుకుంది.

అయితే ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఆమె తన గ్లామర్ డోసును మాత్రం అస్సలు తగ్గించడం లేదు. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఆమె ఫోటోలు చూస్తే ఎవరైనా సరే స్టన్ అవ్వాల్సిందే. సొగసైన చీర మరియు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని ధరించి, ఆమె తన ప్రకాశవంతమైన స్కిన్ షోకు ప్రాధాన్యతనిస్తూ ఘాటైన స్టిల్ ఇచ్చింది.

ఆమె భారత పార్లమెంటులోని అత్యంత అందమైన సభ్యులలో ఒకరిగా క్రేజ్ అందుకుంది.. మిమీ చక్రవర్తి తృణమూల్ కాంగ్రెస్ నుండి జాదవ్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యురాలు. ఇక ఆమె రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ యాక్టింగ్ ప్రొఫెషన్ ను మాత్రం మారువలేదు. అలాగే అప్పుడప్పుడు ఇలా గ్లామరస్ స్టిల్స్ తో కూడా కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది.