Begin typing your search above and press return to search.

వీడియో: మియామీ బీచ్‌లో వైర‌స్ డేట్

మౌని రాయ్ ఇంటర్నెట్‌ను మ‌రిగిస్తోంది. వ‌రుస బికినీ షూట్ల‌తో విరుచుకుప‌డుతున్న ఈ బ్యూటీ తాజాగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసిన బికినీ లుక్ వెబ్ లో మంట‌లు పెడుతోంది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 2:45 AM GMT
వీడియో: మియామీ బీచ్‌లో వైర‌స్ డేట్
X

మౌని రాయ్ ఇంటర్నెట్‌ను మ‌రిగిస్తోంది. వ‌రుస బికినీ షూట్ల‌తో విరుచుకుప‌డుతున్న ఈ బ్యూటీ తాజాగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసిన బికినీ లుక్ వెబ్ లో మంట‌లు పెడుతోంది. స్టైలిష్ అజ్టెక్ ప్రింట్ బికినీ లో టూ హాట్ గా కనిపించింది. మయామి వెకేషన్ నుండి ఈ వీడియో త్వరగా వైరల్ కావడంతో అభిమానుల్లో స్పంద‌న అనూహ్యం.. బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ అద్భుతమైన అందంతో క‌వ్విస్తున్న మౌని రాయ్ స్టైల్ స్టేట్ మెంట్ ఇప్పుడు యువ‌త‌రంలో చ‌ర్చ‌గా మారింది. ఇన్‌స్టంట్ బాలీవుడ్ షేర్ చేసిన వీడియోలో.. మౌని రాయ్ సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళుతోంది. బికినీలో చాలా హాట్‌గా కనిపిస్తోంది.

అయితే ఈ వీడియో త్రోబ్యాక్ వీడియో. ఇప్పుడు మ‌రోసారి మౌని స్వ‌యంగా షేర్ చేయ‌డంతో యువ‌త‌రంలోకి వైర‌ల్ గా మారుతోంది. అజ్టెక్ ప్రింట్ బికినీ లో బోల్డ్ అండ్ వైబ్రెంట్ లుక్ తో క‌వ్వించింది. టోన్డ్ ఫిజిక్ స్ట‌న్నింగ్ ఇమేజ్ తో మౌని నిస్సందేహంగా మియామిలో వేడి పెంచింది.

ఏక్తా కపూర్ `క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ`తో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించినప్పటి నుండి మౌని రాయ్ కెరీర్ ప‌రంగా చాలా పెద్ద స్థాయికి ఎదిగింది. నాగిన్‌లో నటించిన తర్వాత మ‌రింత పాపుల‌రైంది. మౌని 2018లో అక్షయ్ కుమార్ గోల్డ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. గత సంవత్సరం అయాన్ ముఖర్జీ భారీ చిత్రం బ్రహ్మాస్త్రలో కనిపించింది. ఇటీవల జుబిన్ నౌటియాల్‌తో కలిసి `డోటరా` అనే మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. మౌని రాయ్ ఇటీవల `సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ` అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇందులో అనుప్రియ గోయెంకా, హర్లీన్ సేథి, తాహిర్ రాజ్ భాసిన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఢిల్లీ సుల్తాన్ అర్జున్ భాటియా జీవితం చుట్టూ తిరిగే క‌థ‌. ఇది అధికారం కోసం జరిగే పోరాటానికి సంబంధించిన కథ. ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. త‌దుప‌రి సైన్స్ ఫిక్షన్ హారర్ కామెడీ చిత్రం ది వర్జిన్ ట్రీలో సంజయ్ దత్, పాలక్ తివారీ, సన్నీ సింగ్‌లతో కలిసి మౌని స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటుంది.

ఇటీవల జియోసినిమా సల్మాన్ ఖాన్ `బిగ్ బాస్` OTTతో రియాలిటీ స్పేస్‌లోకి ప్రవేశించింది. ఈ ప్రదర్శన విజయవంతం అయిన తర్వాత మ‌రో కొత్త న్యూస్ చెప్పింది మౌని. ప్రపంచవ్యాప్తంగా పాపుల‌రైన రియాలిటీ సిరీస్ టెంప్టేషన్ ఐలాండ్ భారతీయ వెర్ష‌న్ ని ప్రారంభించేందుకు జియో సినిమా సిద్ధంగా ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద డేటింగ్ రియాలిటీ షోలలో ఒకటైన ఐకానిక్ సిరీస్ స్క్రిప్ట్ లేని కంటెంట్ తో గుబులు రేకెత్తించ‌బోతోంద‌ని జియో బృందాలు ప్ర‌చారం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ షోకి హోస్ట్‌గా నటి మౌని రాయ్ హీటెక్కించ‌బోతోంది.