Begin typing your search above and press return to search.

గోల్డెన్ బ్రాలెట్‌లో మెహ‌రీన్ మురిపాలు!

ప్ర‌స్తుతం మెహ్రీన్ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి

By:  Tupaki Desk   |   27 July 2023 6:30 AM GMT
గోల్డెన్ బ్రాలెట్‌లో మెహ‌రీన్ మురిపాలు!
X

పంజాబీ బ్యూటీ మెహ‌రీన్ పిర్జాదా 'ఎఫ్-3' స‌క్సెస్ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. హిట్ వ‌చ్చినా అమ్మ‌డికి ఆ త‌ర్వాత ఛాన్సులు రాలేదు. కెరీర్ లో కొన్ని సక్సెస్ ఫుల్ చిత్రాలు ఉన్న‌ప్ప‌టికీ సొగ‌సరి కెరీర్ మాత్రం ఆశించిన విధంగా ముందుకు వెళ్లలేదు. తెలుగు సినిమా చేసి ఏడాద‌వుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఛాన్సులు వ‌స్తాయ‌ని చూసిన బ్యూటీ లాభం లేద‌నుకుని క‌న్నడ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్ల తెలుస్తోంది.


ప్ర‌స్తుతం మెహ్రీన్ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి ద్విభాషా తమిళ చిత్రం - మరొక చిన్న చిత్రం ఉన్నాయి. మారుతీ ప్ర‌భాస్ తో తెర‌కెక్కిస్తోన్న 'రాజా డీలక్స్‌'లో సంతకం చేస్తుందని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఓ పెద్ద ప్రాజెక్ట్ మిస్ అయిన‌ట్లు అయింది. అలాగే ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. టెంప్టింగ్ ఫోటోలేవి నెట్టింట వైర‌ల్ అవ్వ‌లేదు. దీంతో మెహ‌రీన్ ఏమైపోయింది అన్న డిస్క‌ష‌న్ నెట్టింట తెర‌పైకి వ‌చ్చింది.

అయితే నేను ఎక్క‌డికి వెళ్లిపోలేదు. ఇక్క‌డే ఉన్నానంటూ ఇలా ముంద‌కొచ్చేసింది. అమ్మ‌డు తాజాగా గ్రీస్ కి వెకేష‌న్ కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. గ్రీస్ నుంచి బ్యూటీ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో గ్రీస్ సంప్ర‌దాయ నాగ‌రిక దుస్తుల్లో క‌నిపించే ప్ర‌య‌త్నం చేసింది. సింగిల్ షోల్డ‌ర్ తో గోల్డెన్ బ్రాలెట్‌తో ఉన్న నలుపు-కుర‌చ దుస్తుల్లో ధరించి చూపరులను ఆక‌ట్టుకుంటుంది. అమ్మ‌డు పూర్తిగా జీరోసైజ్ లో ఫోక‌స్ అవుతుంది.

ఒక‌ప్పుడు బొద్దుగా హైలైట్ అయిన బ్యూటీ శ‌రీరంలో తీసుకొచ్చిన మార్పులు కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తున్నాయి. మెహ‌రీన్ ముఖంలో ప్ర‌శాంతత‌ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. కొంత గ్యాప్ త‌ర్వాత సొగ‌స‌రి ఫోటోలు నెట్టింట హ‌ల్చ‌ల్ చేయ‌డంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం మ‌కాం హైద‌రాబాద్ నుంచి పంజాబ్ కి మార్చిన‌ట్లు స‌మాచారం.బ‌థిండా నుంచి బెంగుళూరు కి ఎక్కువ‌గా జ‌ర్నీలు చేస్తున్న‌ట్లు తెలిసింది.