Begin typing your search above and press return to search.

నిలువెత్తు ఎర్ర గులాబీలా మానుషి.. మైండ్ బ్లాక్

కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసే భామ మానుషి చిల్లర్.

By:  Tupaki Desk   |   23 Oct 2023 3:30 PM GMT
నిలువెత్తు ఎర్ర గులాబీలా మానుషి.. మైండ్ బ్లాక్
X

కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసే భామ మానుషి చిల్లర్. గ్లామర్ డోస్ రెట్టింపు చేసి యూత్​ను రెచ్చగొడుతుంటుంది. ప్రస్తుతానికి వరుస సినిమాల్లో నటిస్తూ మస్త్​ జోరులో ఉంది. అయినా సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ.. ఫోటో షూట్లతో అందాలన్నీ ప్రదర్శిస్తూ ఫ్యాన్స్​కు టచ్​లో ఉంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ చూస్తే ఎర్ర గులాబీ పువ్వులా ధగధగ మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపించింది.

హరియాణాకు చెందిన ఈ ముద్దుగుమ్మ 67వ మిస్ వరల్డ్‌ 2017 కిరీటం దక్కించుకుని అందరి కంట్లో పడింది. ఇక ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందరూ ఆమె అందాలను చూడటానికి తెగ ఆరాటపడ్డారు. అంతలా గుర్తింపు సంపాదించుకుందీ భామ. అలా వచ్చిన క్రేజ్​తో సినిమాల్లోకి అడుగుపెట్టేసింది.

ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే అయినా ఈమెకు మాత్రం మొదటి నుంచి మోడలింగ్​పై ఆసక్తి ఉండేదట. అందుకే స్కూల్ డేస్ నుంచే ఫ్యాషన్ షో ల్లో పాల్గొనేది. ఆ జర్నీలోనే మిస్ వరల్డ్​గా అవతరించింది. అనంతరం 2022లో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అక్షయ్‌ కుమార్ తో కలిసి సామ్రాట్ పృథ్వీరాజ్​, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి చిత్రాలు చేసింది. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి.

ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతతో తెగ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడి గ్లామర్​ షో కు అంతా ఫిదా అవుతున్నారు. పింక్​ కలర్ లాంగ్​ మోడ్రన్ ఔట్​ఫిట్లలో క్యూట్ సెల్ఫీ దిగుతూ కన్నుల విందు చేసింది. పింక్ కలర్ లిప్​స్టిక్​, లూజ్ హెయిత్​తో మెస్మరైజ్ చేసేసింది. చేతికి ఆమె ధరించిన మందపాటి గోల్డ్​ బ్రాస్​లైట్​ స్పెషల్ అట్రాక్షన్​గా ఉంది.

ప్రస్తుతం ఈ భామ.. తెలుగులో వరుణ్ తేజ్​తో పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో నటించింది. ఇది డిసెంబర్​లో రిలీజ్ కానుంది. ఇంకా తెహ్రాన్, బడే మియాన్ చోటే మియాన్ చిత్రాల్లో నటించింది.