పిక్ టాక్ : ఈమెను గుర్తు పట్టారా?
ఈ జనరేషన్ వారికి తెలియక పోవచ్చు కానీ మనిషా కొయిరాలా ముందు జనరేషన్ వారికి కచ్చితంగా అభిమాన నటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Tupaki Desk | 29 Nov 2025 6:00 PM ISTఈ జనరేషన్ వారికి తెలియక పోవచ్చు కానీ మనిషా కొయిరాలా ముందు జనరేషన్ వారికి కచ్చితంగా అభిమాన నటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేపాల్ కి చెందిన ఈమె చేసిన సినిమాల కారణంగా పూర్తిగా భారతీయురాలు అనే గుర్తింపు సొంతం చేసుకుంది. రాజకీయంగా ప్రముఖమైన నేపాలి కోయిరాల కుటుంబంలో జన్మించిన ఈమెకి ఎన్నో ఇండియన్ సినిమా అవార్డ్స్ సొంతం అయ్యాయి. దీనిని బట్టే ఆమె నటన ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా మూడు ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న ఈమెకి నేపాల్ ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ ఆఫ్ గూర్ఖా దక్షిణ బహు అవార్డును ప్రధానం చేసింది. 1970 ఆగస్టు 16న జన్మించిన ఈమె 1989లో నేపాలి సినిమా ఫెయిరీ బేతవుల అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హిందీలో ఈమెకి 1991లో ఛాన్స్ దక్కింది. సౌదాగర్ అనే సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.
బాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనూ వెలుగు వెలిగిన ఈమె వయసు ప్రస్తుతం 55 సంవత్సరాలు, ఇండస్ట్రీలో ఇప్పటికీ ఈమెకి ఉన్న గుర్తింపు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్స్ కి సమానంగా ఈమెకి సోషల్ మీడియాలోనూ అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. అందుకే ఈమె గురించి ఏ చిన్న వార్త వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ కావడం కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఎయిర్పోర్టులో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసింది సాధారణంగానే మనిషా కొయిరాలకి ఉండే ఫాలోయింగ్ కారణంగా ఆమె ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి, అయితే ఈసారి ఆమె విభిన్నమైన లుక్ లో కనిపించడం వల్ల అంతా షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆమెనే చాలా యంగ్ లుక్లో చూసిన జనాలు ఈసారి కాస్త ఓల్డ్ లుక్ లో చూసి గుర్తు పట్టలేకపోయాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్నది మనిషా కొయిరాలా అని మీరు వెంటనే గుర్తించి ఉండకపోవచ్చు, అందుకు కారణం ఆమె లుక్ లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ మారింది, వైట్ హెయిర్ స్టైల్ తో పాటు ఫేసులో డల్నెస్ కనిపించడం వల్ల చాలా మంది ఆమెని పోల్చుకోలేకపోతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసి అభిమానులను సొంతం చేసుకున్న మనిషా కొయిరాలా 2012 సంవత్సరంలో అండాశయ క్యాన్సర్ బారిన పడ్డ విషయం తెలిసిందే. సాధారణంగా క్యాన్సర్ని తట్టుకోవడం ముఖ్యంగా నాలుగు పదుల వయసులో క్యాన్సర్ తో పోరాటం అంటే మామూలు విషయం కాదు అలాంటి సమయంలో మనిషా కొయిరాలా అత్యంత ప్రమాదకరమైన అండాశయ క్యాన్సర్ ను ఎదుర్కొని బయటపడి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
2012 నుంచి 2015 వరకు క్యాన్సర్ తో పోరాటం చేసి ఆ మహమ్మారిని జయించిన మనీషా కొయిరాలా ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అయింది. పలు సినిమాల్లో అవకాశాలు కూడా లభించాయి, కానీ ఆమె వయసుకు తగ్గ పాత్రలు చేయడంతో అభిమానులు ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేశారు, దాంతో ఆమె మళ్ళీ ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలని భావించింది. అందుకోసం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతోంది. ఆ మధ్య ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించిన మనిషా కొయిరాలా చివరిగా 2023 సంవత్సరంలో వచ్చిన ఒక హిందీ సినిమాలో నటించడం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మనిషా కొయిరాలా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. అయితే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న కార్యక్రమాలకు, సినిమా ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తుల కార్యక్రమాలకి హాజరవుతూ మీడియాలో నిలుస్తూ వస్తోంది. నటిగా ఆమె మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
