Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఇంట్లో ప్లూటో వార‌సుడు?

మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్, వారి పిల్లలు గౌతమ్, సితార, అలాగే వారి రెండు పెంపుడు కుక్కలతో అన్యోన్య‌త‌ గురించి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Oct 2023 11:42 AM GMT
మ‌హేష్ ఇంట్లో ప్లూటో వార‌సుడు?
X

మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్, వారి పిల్లలు గౌతమ్, సితార, అలాగే వారి రెండు పెంపుడు కుక్కలతో అన్యోన్య‌త‌ గురించి తెలిసిందే. మ‌హేష్ కి పెట్ డాగ్స్ అంటే ఎంతో అభిమానం. అయితే విచార‌క‌రంగా వారి కుటుంబ సభ్యుడు `ప్లూటో` (ప్రియమైన పెంపుడు కుక్క) మరణించింది. ఈ వార్తను చెబుతూ ఆ కుటుంబం చాలా ఎమోష‌న‌ల్ అయింది. ప్లూటోని మ‌ర్చిపోలేమ‌ని మ‌హేష్‌-న‌మ్ర‌త స‌హా కిడ్స్ ఎమోష‌న‌ల్ అయ్యారు.

అయితే ఉన్నట్టుండి ప్లూటో లాంటి మ‌రో ప‌ప్పీతో మ‌హేష్ ప్ర‌త్యక్ష‌మ‌వ్వడం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మ‌హేష్ ఓ ప‌ప్పీని ఇలా చేతుల్లోకి తీసుకుని న‌వ్వులు చిందిస్తున్న ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. వీడే ప్లూటో వార‌సుడు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది ప్లూటో వార‌సుడా కాదా? అన్న‌ది మ‌హేష్ కుటుంబం ధృవీక‌రించాలి.

ఇక ఈ ఫోటోగ్రాఫ్ లో రెండో కోణం ఏమిటంటే.. ఇందులో మ‌హేష్ ఎంతో స్మార్ట్ గా క‌నిపిస్తున్నాడు. అత‌డి హ్యాండ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. లుక్ ప‌రంగా మేకోవ‌ర్ క‌నిపిస్తోంది. అత‌డు త‌దుప‌రి త్రివిక్ర‌మ్ తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గుంటూరు కారం చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ఈ సినిమా పూర్తి కాగానే ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళితో మ‌హేష్ భారీ సినిమా చేయ‌నున్నాడు. ఇది ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ క‌థాంశంతో విజువ‌ల్ ట్రీట్ గా నిల‌వ‌నుంద‌ని ఇప్ప‌టికే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇప్ప‌టికే స్క్రిప్టుపై ప‌ని చేస్తున్నారు. ఈ ఏడాది చివ‌రిలో లేదా కొత్త సంవ‌త్స‌రంలో సినిమాని అధికారికంగా లాంచ్ చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది.