Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హాఫ్ శారీలో గుండె గ‌ల్లంతే

మ‌న సాంప్ర‌దాయంలో హాఫ్ శారీ ప్రోగ్రామ్‌కి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. వ‌య‌సులోని మిస‌మిస‌ల్ని ఎలివేట్ చేసేది హాఫ్ శారీ. తెలుగు లోగిళ్ల‌లో ఇలాంటివి రెగ్యుల‌ర్ గా చూస్తూ ఉంటాం.

By:  Tupaki Desk   |   22 Oct 2023 5:19 AM GMT
ఫోటో స్టోరి: హాఫ్ శారీలో గుండె గ‌ల్లంతే
X

మ‌న సాంప్ర‌దాయంలో హాఫ్ శారీ ప్రోగ్రామ్‌కి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. వ‌య‌సులోని మిస‌మిస‌ల్ని ఎలివేట్ చేసేది హాఫ్ శారీ. తెలుగు లోగిళ్ల‌లో ఇలాంటివి రెగ్యుల‌ర్ గా చూస్తూ ఉంటాం. ఇక న‌వ‌రాత్ర‌ల వేళ హాఫ్ శారీ ధ‌రించి కాంబినేష‌న్ బ్లౌజ్ తో ప్ర‌త్య‌క్ష‌మైతే ఇంకేమైనా ఉందా?

ఇదిగో ఇక్క‌డ ఈ అందాన్ని చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు. ఈ బ్యూటీ ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాలా? అందాల‌ కృతి శెట్టి గురించే ఇదంతా. సిల్క్ హాఫ్ చీర.. పసుపు రంగు బ్లౌజ్‌తో నారింజ రంగు లెహంగా ధ‌రించి క‌నిపించింది. ఇక ఈ చీర‌కు త‌గ్గ‌ట్టే బంగారు ఆభరణాలతో అలంకరించబడిన దుపట్టాతో అబ్బురపరిచింది. ఇక ఆ స‌న్న‌ని న‌డుమును ఆవిష్క‌రించిన తీరుకు మంత్ర‌ముగ్ధులు అవ్వాల్సిందే. సాంప్ర‌దాయాన్ని కాపాడుతూనే త‌న‌ని తాను అందంగా ప్రెజెంట్ చేసుకోవ‌డం ఎలానో కృతి శెట్టిని చూసి నేర్చుకోవాలి. ప్రత్యేకించి ఈ ఆకర్షణీయమైన లుక్‌లో తన న‌డుము సొగ‌సును ఎలివేట్ చేసిన తీరు హీట్ పుట్టిస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కృతి శెట్టి క‌న్న‌డ అమ్మాయి. ఉప్పెన లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత వ‌రుస చిత్రాల్లో న‌టించినా అవేవీ క‌లిసి రాలేదు. ప్రస్తుతం తెలుగు,త‌మిళంలో ప‌లు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. శర్వానంద్ న‌టిస్తున్న `శర్వా 35`లో అలాగే `జెనీ`.. కార్తీ26 అనే చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే ఓ మలయాళ చిత్రంలో కూడా న‌టిస్తోంద‌ని స‌మాచారం.