Begin typing your search above and press return to search.

కేతిక లుక్కును కొట్టేవారే లేరు.. కానీ లక్కే లేదు

కేతిక శర్మ అందానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఓ శిల్పి చెక్కిన అందాల శిల్పంలా ఉంటుంది.

By:  Tupaki Desk   |   20 Aug 2023 7:56 AM GMT
కేతిక లుక్కును కొట్టేవారే లేరు.. కానీ లక్కే లేదు
X

కేతిక శర్మ అందానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఓ శిల్పి చెక్కిన అందాల శిల్పంలా ఉంటుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ కి పరిచయం అయ్యి చాలా కాలమే అవుతుంది.నిజానికి, ఆమె అందానికి ఈపాటికి స్టార్ హీరోయిన్ కావాల్సింది. కానీ, అదృష్టం కలిసిరాక, ఇంకా మంచి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. అందం మాత్రమే కాదు, నటనలోనూ ఈ పాపకు మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఇప్పటి వరకు కేతిక చేసిన ఏ సినిమా మంచి హిట్టు అందుకోలేకపోయింది. దీంతో, ఈ బ్యూటీ ఇంకా సక్సెస్ కోసం ఎదురుచూపులతోనే కాలం గడిపేస్తోంది.


సినిమా అవకాశాలు ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. గ్యాప్ లేకుండా, ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. ఆ ఫోటోల్లో ఆమె తన అందాలను చూపిస్తూ, తన ఫాలోవర్స్ ని ఊరిస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది. అయితే, ఇవి రీసెంట్ ఫోటోలు కావట. థ్రో బ్యాక్ ఫోటోలు. తన తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లినప్పటి ఫోటోలు. ఎప్పటి ఫోటోలు అయితే ఏంటి? ఈ ఫోటోల్లో కేతిక అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


బుల్లి డెనిమ్ జీన్స్ స్కర్ట్ , దానిపై టైట్ టీషర్ట్ ధరించింది. ఇక, కెమేరాను విభిన్న యాంగిల్స్ లో పెట్టి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలన్నింటినీ షేర్ చేసింది. ఫ్యాన్స్ ఆ ఫోటోలు చూసి పండగ చేసుకుంటున్నారు. ఆ ఫోటోలో చూస్తుంటేనే, తమ ఫోన్ స్క్రీన్ వేడెక్కిపోతోందని కొందరు కామెంట్ చేయగా, బికినీ ఫోటోలు షేర్ చేయవచ్చు కదా అని కొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. కొందరైతే చాలా నాటీ కామెంట్స్ కూడా చేస్తుండటం విశేషం.


కాగా, కేతిక టాలీవుడ్ కి పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందంతో అందరినీ ఆకర్షించింది. కానీ, ఆ మూవీ ప్లాప్ కావడంతో, పెద్దగా క్లిక్ కాలేకపోయింది.



ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా', నాగ శౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’లో నటించింది. అవి కూడా క్లిక్ కాలేదు. తాజాగా బ్రోలో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ, క్రెడిట్ అంతా పవన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. మరి ఫ్యూచర్ లో ఆమెకు ఎలాంటి ఛాన్సులు వస్తాయో చూడాలి.