Begin typing your search above and press return to search.

కీర్తి గ్లామర్ మాయ.. నడముతోనే అలా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది.

By:  Tupaki Desk   |   9 Aug 2023 11:30 PM GMT
కీర్తి గ్లామర్ మాయ.. నడముతోనే అలా..
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది.ఎలాంటి పాత్ర అయినా అలవోగా చేయాలంటే కీర్తి తర్వాతే. మహానటి సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక కీర్తి ఓ వైపు హీరోల సరసన నటిస్తూనే, మరో వైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవల దసరా సినిమాలో వెన్నెల పాత్రలో అదరగొట్టింది. డీ గ్లామర్ లుక్ లో కూడా అందంగా కనిపించింది.

ఆమె అందానికీ, నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ పాత్రలో కీర్తి కాకుండా మరెవరూ ఇంత అద్భుతంగా నటించరేమో అన్నట్లుగా నటించింది. అయితే, నిజం చెప్పాలంటే కీర్తి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా అందంగా ఉండేది. కానీ, తర్వాత చాలా స్లిమ్ గా మారింది. సన్నగా మారిన తర్వాత ఆమె అందం తగ్గిందనే చెప్పాలి.


మళ్లీ ఇప్పుడిప్పుడే గ్లామర్ డోస్ పెంచుతోంది. తాజాగా ఆమె పిక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటోని కీర్తి ఫ్యాన్ పేజ్ షేర్ చేసింది. అయితే, అందులో కీర్తి చాలా అందంగా కనపడుతోంది. సన్నగా మారిన తర్వాత కీర్తి సినిమాల్లో కాకుండా, బయట అంత అందంగా కనపించింది చాలా తక్కువ. ఈ ఫోటోలో మాత్రం బాగుంది.

నెటిజన్లు కూడా వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్లూ జీన్స్ మీద హై నెక్ టాప్ ధరించింది. దానికి గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ జత చేసింది. అలాగే సన్నని నడుము అందాలతో మతిపోగొట్టేసింది. కాగా, ఇటీవల భోళా శంకర్ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్ లో సైతం శారీలో చాలా గ్లామరస్ గా కనిపించింది. దసరా తర్వాత కీర్తి నటించిన సినిమా భోళా శంకర్.

ఓ పక్క హీరోయిన్ గా మంచి ఆఫర్లు వస్తున్నా, చెల్లెలి పాత్రలో నటించడం విశేషం. ఈ మూవీలో హీరోయిన్ కంటే, చెల్లెలి పాత్రకే ఎక్కువ మైలేజ్ ఉండటంతో ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి చిరు, కీర్తిల పాత్రలే హైలెట్ అని తెలుస్తోంది. ఈ భోళా శంకర్ మూవీ ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా, తమన్నా, సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు.