Begin typing your search above and press return to search.

బుల్లితెర నటి.. వ్వాటే గ్లామర్ షో

గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడం క్యారెక్టర్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమే.

By:  Tupaki Desk   |   1 Oct 2023 9:08 AM GMT
బుల్లితెర నటి.. వ్వాటే గ్లామర్ షో
X

గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడం క్యారెక్టర్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమే. ముఖ్యంగా సోషల్ మీడియా ఫాలోవర్స్ అయ్యే వారికి ఈ మధ్య మరింత దగ్గరైంది. అందుకు కారణం ఒకటే.. ఒక్కసారిగా గేర్​ మార్చి.. ఎవరూ ఊహించని రేంజ్​లో హాట్ ఫొటోషూట్స్​ చేయడమే. తాజాగా మరో కొత్త ఫొటోతో అదరగొట్టేసింది.

ఈమె అసలు పేరు జ్యోతి రాయ్. కన్నడకు చెందిన ఈ నాలుగు పదుల వయసున్న ముద్దుగుమ్మ.. తెలుగు, కన్నడ సీరియల్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. పలు కన్నడ చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకుంది. సీరియల్స్ లో చాలా కాలం నుంచి తల్లి పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా నిండైన చీరలు కట్టి, బొట్టు పెట్టి ఎంతో సంప్రదాయంగా కనిపించి మెప్పించింది. కాని ఇప్పుడు సడెన్​గా రూట్​ మార్చింది.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అందాలను ఎక్స్​పోజింగ్​ చేస్తూ తన హాట్ హాట్ ఫోటోలను రోజుకొకటి షేర్ చేస్తోంది. షార్ట్ డ్రెస్సుల్లో ఆమెను చూసి షాక్ అయిపోతున్నారు. రీసెంట్​గా తాను ప్రెట్టీ గర్ల్ అనే ఓ వెబ్ సిరీస్​లో మెయిన్ లీడ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగానే ఆమె రోజూ ఈ ఫొటోషూట్స్​తో రచ్చ చేస్తోందని అంతా అనుకుంటున్నారు.

తాజాగా గ్రీన్ కలర్ మోడ్రన్ ఔట్ ఫిట్​లో ఆమె అదిరిపోయే పిక్​ను షేర్ చేసింది. ఇందులో ఆమె అందం అభివర్ణించలేనంతగా ఉంది. హైడోస్​లో గ్లామర్​ షో చేసింది. స్విమ్మింగ్ ఫూల్ వద్ద చేతులు పైకెత్తి మాయ చేసే చూపులతో మత్తెక్కించింది. ఇది చూసిన నెటిజన్లు గ్లామర్ బాంబ్​ను తట్టుకోవడం కష్టమేనంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఆమెకు ఓ బాబు కూాడ ఉన్నాడు. ఆమె భర్తకు విడాకులు ఇచ్చి ఓ యంగ్ డైరెక్టర్​తో రిలేషన్ షిఫ్​లో ఉన్నట్లు గత కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.