Begin typing your search above and press return to search.

జగ్గూభాయ్.. ఏజ్ పెరుగుతుందా.. తగ్గుతుందా?

తెలుగు ప్రేక్షకులకు జగపతిబాబు గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   2 Sept 2023 4:08 PM IST
జగ్గూభాయ్.. ఏజ్ పెరుగుతుందా.. తగ్గుతుందా?
X

తెలుగు ప్రేక్షకులకు జగపతిబాబు గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక వర్సిటైల్ యాక్టర్. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి జగపతి బాబు తన కెరీర్ ని మొదలుపెట్టారు. అయితే, మొదట్లో వరస వైఫల్యాలు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తర్వాత ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేశారు. జగపతి బాబు సినిమాలు అంటే మహిళలు ఎక్కువగా ఇష్టపడి చూసేవారు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆయన, ఇప్పుడు తన పంథా మార్చుకున్నారు.

నిజానికి హీరోగా ఒక ముద్ర వేసుకున్నవారు తర్వాత విలన్ రోల్స్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, ఆయన తన కమ్ బ్యాక్ ని విలన్ రోల్స్ తో మొదలుపెట్టారు. స్టార్ హీరోల్లో విలన్ కావాలి అంటే, జగపతిబాబు బెస్ట్ ఆప్షన్ అనే రేంజ్ మారిపోయారు. అప్పటి నుంచి ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు.

పాన్ ఇండియా సినిమాల్లోనూ విలన్ రోల్స్ ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. వరసగా, ఒక దాని వెంట మరో సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇక, సోషల్ మీడియాలోనూ జగపతి బాబు చురుకుగా ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు షేర్ చేయడం, తన ఫోటోలు పంచుకోవడం లాంటివి చేస్తుంటారు.

తాజాగా పింక్ అవుట్ ఫిట్ లో ఆయన షేర్ చేసిన ఫోటోలు చూసి ప్రేక్షకులే స్టన్ అవుతున్నారు. ఎందుకంటే , ఆ ఫోటోల్లో జగపతి బాబు అంత స్టన్నింగ్ గా ఉన్నారు. ఇప్పటి వరకు జగ్గూ బాయ్ ని చాలా గెటప్స్ లో చూసే ఉంటారు. కానీ, ఇంత స్టైలిష్ చూడటం చాలా అరుదు అనే చెప్పాలి. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.


ఆ ఫోటోలు చూస్తుంటే జగ్గూ భాయ్ వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనే అనుమానం కలగమానదు. ఆయన అంత స్టైలిష్ గా ఉన్నారు. వావ్, సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.