Begin typing your search above and press return to search.

ఎల్లో శారీతో పిచ్చెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా!

ఫరియా అబ్దుల్లా.. ఆరడుగుల ఈ అందగత్తె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Tupaki Desk   |   10 Feb 2026 10:00 AM IST
ఎల్లో శారీతో పిచ్చెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా!
X

ఫరియా అబ్దుల్లా.. ఆరడుగుల ఈ అందగత్తె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో 'చిట్టి'గా గూడు కట్టుకున్న ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ 'జాతి రత్నాలు' సినిమాతో అభిమానుల హృదయాలను దోచుకుంది. అమాయకమైన నటనతో ఆకట్టుకునే డాన్స్ తో తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఆరడుగుల అందం ఈమెకు కెరియర్ మొదట్లో అవకాశాలను అందించలేదు. కారణం ఈమె హైట్ కు తగ్గట్టు హీరోలు దొరకకపోవడం. రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు మినహా ఈమె హైట్ ని సరితూగే హీరోలు లేకపోవడం వల్ల ఈమెకు ఆ అవకాశాలు లభించలేదని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు యంగ్ హీరోలు ఈమె హైట్ ను బ్యాలెన్స్ చేస్తూ ఈమె నటనను ఉపయోగించుకుంటూ తమ సినిమాలతో సక్సెస్ అందుకోవడమే కాకుండా చిట్టికి కూడా మంచి అవకాశాలు కల్పిస్తున్నారు.

ఇక తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లా ఇటీవల తిరువీర్ హీరోగా వస్తున్న 'భగవంతుడు' సినిమాలో తొలిసారి పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ కం హీరో తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న 'గాయపడ్డ సింహం' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ టీజర్ కం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ వేదికపై ఫరియా అబ్దుల్లా తన అందాలతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది.

ఎల్లో కలర్ చీర కట్టుకొని వచ్చిన ఈమె తన అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా ఈ పొడుగు కాళ్ళ సుందరి అందానికి దాసోహం అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే ఫరియా అబ్దుల్లా లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తాను ప్రేమలో పడ్డ విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంది. సాధారణంగా హీరోయిన్లు తమ రిలేషన్షిప్ ను బహిరంగంగా బయట పెట్టడానికి ఆసక్తి కనబరచరు. కానీ ఫరియా అబ్దుల్లా మాత్రం తాను రిలేషన్ లో ఉన్న విషయాన్ని బాహాటంగా బయటకి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది

ఇటీవల ఆమె మాట్లాడుతూ.." నేను ఒక వ్యక్తితో ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్నాను.ఇక నా ప్రియుడి విషయానికొస్తే నేను ప్రేమిస్తున్న వ్యక్తి ముస్లిం కాదు.ఆయన ఒక హిందువు. వృత్తిపరంగా కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. నా సినిమాల్లో నా డాన్స్ ఇంత బాగా రావడానికి.. నేను నా డాన్స్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఆయనే ప్రస్తుతం మేము ప్రేమికులుగానే కాకుండా ఇద్దరం ఒక టీం లాగా కలిసి పనిచేస్తున్నాము" అంటూ ఫరియా చెప్పుకొచ్చింది.