శర్మా సిస్టర్స్ గా పాపులరైన నేహాశర్మ- ఐషా శర్మ బాలీవుడ్ లో బిగ్ కెరీర్ కోసం నిరంతర ప్రయత్నాల్ని ఆపలేదు. గడిచిన ఐదారేళ్లుగా సిస్టర్స్ బ్రేక్ లేకుండా ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా యూట్యూబ్ లో చెలరేగి ఫోటోషూట్లను షేర్ చేస్తున్నారు. ఇవన్నీ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఇక తన సోదరితో పోటీపడుతూ నిరంతర ఫోటోషూట్లతో విరుచుకుపడడంలో ఐషా శర్మ ఎప్పుడూ స్పీడ్ చూపిస్తోంది.
తాజాగా మరోసారి హాట్ ఫోటోషూట్ తో వెబ్ లోకి దూసుకొచ్చింది ఐషా. ఈసారి రెడ్ హాట్ లుక్ తో ఈ బ్యూటీ కవ్వించింది. ప్రస్తుతం యువతరంలో ఈ ఫోటో వైరల్ గా మారింది. శర్మా గాళ్ ఈ కొత్త లుక్ పై రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
2018లో విడుదలైన సత్యమేవ జయతే తర్వాత ఐషా శర్మకు ఆశించిన అవకాశాలేవీ దక్కలేదు. ప్రస్తుతం కెరీర్ పరంగా బ్యాక్ బెంచీకే పరిమితమైంది. హిందీ పరిశ్రమతో పాటు, ఇప్పుడు దక్షిణాదినా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఈ భామకు త్వరలో బ్రేక్ వస్తుందని ఆశిద్దాం.
కెరీర్ ప్రస్థానం:
ఐషా శర్మ నటి కం మోడల్. మొదట ఆయుష్మాన్ ఖురానా `ఇక్ వారి` మ్యూజిక్ వీడియోలో కనిపించింది. తర్వాత హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ్ జయతే (2018)లో జాన్ అబ్రహం -మనోజ్ బాజ్‌పేయితో కలిసి నటించింది. శర్మ మోడల్‌గా తన వృత్తిని ప్రారంభించింది. లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్ సహా అనేక పాపులర్ బ్రాండ్‌లకు పాపులర్ ఫేస్ గా మారింది. 2016లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్‌లో ఒకరిగా ఎంపికైంది.