Begin typing your search above and press return to search.

ఆ ప్లేస్ లో టాటూ వేయించుకున్న చిన్న జాను..!

గౌరీ కిషన్, ఈ పేరు చెబితే అందరికీ గుర్తుకు రాకపోవచ్చు.

By:  Tupaki Desk   |   19 July 2023 12:36 PM GMT
ఆ ప్లేస్ లో టాటూ వేయించుకున్న చిన్న జాను..!
X

గౌరీ కిషన్, ఈ పేరు చెబితే అందరికీ గుర్తుకు రాకపోవచ్చు. కానీ, 96 జాను అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు.త్రిష, విజయ్ సేతుపతి హీరో హీరోయిన్లుగా నటించిన 96 మూవీ అందరూ చూసే ఉంటారు. ఆ మూవీలో త్రిష చిన్నప్పటి క్యారెక్టర్ జాను గా గౌరీ కిషన్ అనే అమ్మాయి నటించింది. ఇదే సినిమాని తెలుగులో జాను అని రీమేక్ చేయగా, తన పాత్రను మళ్లీ ఆ అమ్మాయే నటించి అదరగొట్టింది.

ఇప్పుడు ఈ చిన్నమ్మాయే హీరోయిన్ గా మారి అదరగొడుతోంది. వరసగా అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటి వరకు తమిళంలో ఆమె పలు సినిమాల్లో నటించగా, తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా శ్రీదేవి, శోభన్ బాబు సినిమాలో నటించింది. ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, పెద్దగా క్లిక్ అవ్వలేదు. టాలీవుడ్ లో దీంతో మంచి ఛాన్సుల కోసం ఎదురు చూస్తోంది. కాగా, ఈ బ్యూటీ తాజాగా వార్తల్లోకి ఎక్కింది.


దానికి, ఆమె టాటూ వేయించుకోవడమే కారణం. టాటూ వేయించుకోవడం లో గొప్పేముంది అని మీరు అనుకోవచ్చు. తాను టాటూ వేయించుకున్న ప్లేస్ ఇప్పుడు చర్చనీయాంశం కావడం విశేషం. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె అభిమానులతో చిట్ చాట్ చేసింది.

అప్పుడే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తన టాటూని రివీల్ చేసింది. తన బాడీలోని ప్రైవేట్ పార్ట్ వద్ద, ఎవరికీ చూపించుకోలేని ప్లేస్ లో ఆమె టాటూ వేయించుకుంది. దానిని ఫ్యాన్ కోసం రివీల్ చేసింది. రొమ్ము కింద భాగంలో ఏదో ఆకులాంటి డిజైన్ వేయించుకుంది. రిబ్ టాటూ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే, ఆమె టాటూ కి ఫ్యాన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

పాపం, పాజిటివ్ గా వస్తుందని ఆనుకుంటే, నెగిటివ్ గా ఎక్కువ మంది కామెంట్స్ చేయడం విశేషం. అక్కడ టాటూ ఏంటి మరీ దారుణంగా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఆమెకు ఆల్రెడీ చేతి మణికట్టు వద్ద ఓ టాటూ ఉంది. ఇది రెండో టాటూ కావడం విశేషం.