Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: క‌న్నుల పండుగ‌లా దృశ్యం అమ్మాయి

సౌతిండ‌స్ట్రీలో చాలా మంది న‌టీనటులు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై పరిశ్రమలోని పాపుల‌ర్ తార‌లుగా ఎదిగారు.

By:  Tupaki Desk   |   29 Sep 2023 5:19 AM GMT
ఫోటో స్టోరి: క‌న్నుల పండుగ‌లా దృశ్యం అమ్మాయి
X

సౌతిండ‌స్ట్రీలో చాలా మంది న‌టీనటులు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై పరిశ్రమలోని పాపుల‌ర్ తార‌లుగా ఎదిగారు. తరుణ్, అఖిల్, అంకిత, శ్రియా శర్మ, నాగ అన్వేష్, షామిలి, సుహాని, ఆకాష్ పూరి, మహేంద్రన్, తేజ సజ్జా, బాలాదిత్య, మనోజ్ నందన్, శ్రావ్య, తనీష్, నిత్యా శెట్టి వంటి వారు ఈ కేటగిరీనే.

అయితే ఇందులో కొంద‌రు తెర నుంచి దూర‌మ‌య్యారు. మ‌రికొంద‌రు గొప్ప స్టార్ డ‌మ్ ని అందుకున్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా ఆశించినంత‌ ప్రభావం చూపడంలో విఫలమయ్యారు. వారిలో దగ్గుబాటి వెంకటేష్ చిన్న కూతురు అను పాత్రను పోషించిన ఎస్తేర్ అనిల్ పేరు ఉంది. 2014 సూపర్ హిట్ చిత్రం దృశ్యం2లో ఎస్తేర్ న‌టించింది. పదిహేనేళ్ల వయసులో కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు గ్రహీతగా ఎస్తేర్ పేరు మార్మోగింది.

కానీ ఇవేవీ త‌న‌కు క‌లిసి రాలేదు. దృశ్యం అదే పేరుతో మలయాళ హిట్ చిత్రానికి అధికారిక రీమేక్ లు విడుద‌ల‌య్యాయి. తెలుగు- తమిళ రీమేక్‌లలో ఎస్తేర్ తన పాత్రను తిరిగి పోషించింది. త‌న స్వ‌స్థ‌లం కేరళలోని వాయనాడ్. ఎస్తేర్ అనిల్ 2010లో అజి జాన్ దర్శకత్వం వహించిన `నల్లవన్` చిత్రంలో తొలిసారిగా నటించింది. ఆ త‌ర్వాత ఒరు నాల్ వరుమ్, దృశ్యం, పాపనాసం, మిస్టర్ & ఎంఎస్ రౌడీ, ఊలు, జాక్ అండ్ జిల్ వంటి చిత్రాలలో నటించింది. ఇటీవ‌ల‌ జోహార్ అనే తెలుగు చిత్రంలో కథానాయికగా ఎంపికైంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ క‌థాంశంతో ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహించ‌గా, ధర్మ సూర్య పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ మార్ని నిర్మించారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నైనా గంగూలీ, ఎస్తేర్ అనిల్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇన్ స్టాలో ఎస్తేర్ స్పీడ్:

ఎస్తేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మంది అభిమానుల ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇటీవ‌ల ఈ భామ లుక్ అమాంతం మారింది. తాజాగా వేడెక్కించే ఫోటోషూట్ ని ఎస్తేర్ షేర్ చేసింది. రంగురంగుల‌ స్ట్రాపీ కట్-అవుట్ డ్రెస్‌లో ఆకర్షణీయమైన ఫోటోలను ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఎస్తేర్ రూప‌లావ‌ణ్యం ఆక‌ట్టుకుంటోంది. ముఖ్యంగా త‌న‌లో ప‌రిణ‌తి పెరిగిందని ఈ ఫోటోషూట్ చెబుతోంది. ఈ కొత్త రూపం చూశాక అయినా మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తారేమో చూడాలి.