Begin typing your search above and press return to search.

దిశా పటానీ.. మరోసారి హై డోస్ గ్లామర్

దిశా పటానీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బోల్డ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ లాగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   27 Aug 2023 9:41 AM GMT
దిశా పటానీ.. మరోసారి హై డోస్ గ్లామర్
X

దిశా పటానీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బోల్డ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ లాగా ఉంటుంది. బోల్డ్ నెస్ అంటే మాటల్లో కాదు, తన స్కిన్ షో చేసే విషయంలో. ఎప్పటికప్పుడు తన గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ తన అందాలతో కుర్రాళ్ల మనసు దోచేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. ఎప్పటికప్పుడు క్లీవేజ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. అందుకు తగినట్లే బికినీల్లో, ఎక్కువగా ఇన్నర్ వేర్ లలో దర్శనిమిస్తూ ఉంటుంది. ఒంటి నిండి దుస్తులు ధరించినా, అందులోనూ అందాలు ఎలా ఆరబోయాలో దిశాకు తెలిసినంతగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. తాజాగా, తనలోని బోల్డ్ యాంగిల్ రెట్టింపు చేసింది. దిశ బికినీలో కనిపించడం చాలా కామన్. అయితే, ఈ సారి తన లో దుస్తులు చూపించడం కోసం, ముందుగా వేసుకున్న షర్ట్ ని తొలగిస్తూ, దానిని వీడియో తీసి షేర్ చేసింది.

ఈ వీడియో చూసి కొందరు ఏంటా ఆ అందాలు అని పండగ చేసుకుంటుంటే, మరి కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. మరీ ఇంత దారుణంగా వీడియో తీసి షేర్ చేయాల్సిన అవసరం ఏముంది అని కౌంటర్లు వేస్తున్నారు. ఇక, దిశ గ్లామర్ షో కోసమే సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారు. కేవలం ఇన్ స్టాగ్రామ్ లో దగ్గరదగ్గరగా 6మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

దిశా కెరీర్ విషయానికి వస్తే, మన తెలుగులో లోఫర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా నటించగా, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. సినిమా ఓ మోస్తారుగా బాగానే ఆడినా, దిశా పాప సినిమాలో అందాలు బాగానే ఆరబోసినా, ఎందుకో మళ్లీ తెలుగులో ఛాన్సులు రాలేదు. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ లో ఆయన లవర్ ప్రాతలో కూడా కొద్ది సేపు మెరిసింది.

అంతేకాకుండా, ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె లో దిశ నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు.