Begin typing your search above and press return to search.

బాడీ హ‌గ్గింగ్ లుక్ తో గుబులు పెంచిన దిశా

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న `లోఫ‌ర్` చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది దిశా ప‌టానీ. పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ `క‌ల్కి 2898 ఏడి` చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌నిపించింది.

By:  Tupaki Desk   |   29 Nov 2025 9:24 AM IST
బాడీ హ‌గ్గింగ్ లుక్ తో గుబులు పెంచిన దిశా
X

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న `లోఫ‌ర్` చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది దిశా ప‌టానీ. పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ `క‌ల్కి 2898 ఏడి` చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌నిపించింది. త‌మిళంలో సూర్య స‌ర‌స‌న కంగువ అనే భారీ చిత్రంలోను న‌టించింది. అయితే దిశా ప‌టానీ కెరీర్ సౌత్ లో ఆశించిన రేంజుకు చేరుకోలేదు. దానికి కార‌ణం న‌టిగా త‌న‌ను తాను నిరూపించుకునేందుకు స్కోప్ లేని పాత్ర‌లే ఇక్క‌డ ద‌క్కాయి. దిశాకు ఉన్న గ్లామ‌ర్ డాళ్ ఇమేజ్ చాలా అడ్డంకుల‌ను సృష్టించింది. అయితే అవ‌కాశాల ప‌రంగా దిశా కెరీర్ కి వ‌చ్చిన స‌మ‌స్య లేదు. అలాగే దిశాకు సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ క్రేజ్ అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు.

దీనికి కార‌ణం దిశా నిరంత‌ర ఫోటోషూట్లు, వీడియో షూట్ల‌తో అన్ లిమిటెడ్ ట్రీట్ ఇవ్వ‌డానికి వెన‌కాడ‌దు. తాజాగా మ‌రోసారి దిశా అలాంటి ఒక ఫోటోషూట్ తో యూత్ లో గుబులు పెంచుతోంది. దిశా ఈ లేటెస్ట్ ఫోటోషూట్ లో బ్లాక్ క‌ల‌ర్ బాడీ హ‌గ్గింగ్ కోట్ ని ధ‌రించింది. ఈ అంద‌మైన డిజైన‌ర్ డ్రెస్ లో దిశా ఇన్న‌ర్ అందాల ఎలివేష‌న్ ప్ర‌ధానంగా హైలైట్ అయింది. ఇది ఇన్న‌ర్ క‌ట్ డిజైన‌ర్ లుక్. దిశా కోసం ప‌ర్ఫెక్ట్ గా రూపొందించిన ఒక మోడ్ర‌న్ అప్పీల్ ఉన్న కోట్ అన‌డంలో సందేహం లేదు. దిశా టోన్డ్ అందాల‌ను వంద‌శాతం ఎలివేట్ చేయ‌డానికి ఈ డిజైన‌ర్ లుక్ ప‌ర్ఫెక్ట్ గా యాప్ట్ అయింద‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో గుబులు పెంచుతోంది.

బికినీలు, మోనోకినీల‌లో దిశా ఎప్పుడూ యూనిక్ నెస్ ని ప్ర‌ద‌ర్శిస్తుంది. ఇప్పుడు బాడీ హ‌గ్గింగ్ దుస్తుల‌లోను త‌న అందాల ప్ర‌దర్శ‌న‌తో హ‌వా సాగిస్తోంది. దిశా తాజా లుక్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన కొన్ని క్ష‌ణాల్లోనే వేల‌ల్లో లైక్ లు, క్లిక్ లు వ‌చ్చాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, దిశా పటానీ తన నటనా జీవితాన్ని తెలుగు చిత్రం లోఫర్‌తో ప్రారంభించింది. బాలీవుడ్‌లో, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసిగా న‌టించింది. చైనీస్ చిత్రం కుంగ్ ఫూ యోగాలో జాకీ చాన్‌తో కలిసి నటించింది. 2024లో వ‌రుస‌గా మూడు చిత్రాలలో నటించింది: సిద్ధార్థ్ మల్హోత్రాతో యోధ, ప్రభాస్‌తో కల్కి 2898 AD, సూర్యతో కంగువ. ఈ సంవత్సరం అనీస్ బాజ్మీ మల్టీ స్టారర్ `వెల్‌కమ్ టు ది జంగిల్‌`లో కనిపిస్తుంది. వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే, టైగ‌ర్ ష్రాఫ్ నుంచి విడిపోయాక ఫిట్నెస్ కోచ్ అలెక్స్ఇలిక్ తో డేటింగ్ లో ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. కానీ ఇటీవ‌లి కాలంలో ఈ జంట కూడా బ్రేక‌ప్ అయింద‌ని క‌థ‌నాలొచ్చాయి.