Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్ K - ఇది ఫస్ట్ లుక్ కాదు.. రెగ్యులర్ లుక్!

ఈ పోస్టర్​లో దీపిక సీరియస్​గా కనిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్​కు సంబంధించిన లుక్​లా ఉంది. కానీ ఆమె ఫేస్​ వరకే ఈ పోస్టర్​లో చూపించారు.

By:  Tupaki Desk   |   18 July 2023 5:25 AM GMT
ప్రాజెక్ట్ K - ఇది ఫస్ట్ లుక్ కాదు.. రెగ్యులర్ లుక్!
X

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ - దర్శకుడు నాగ్ అశ్విన్ కలిసి చేస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ 'ప్రాజెక్ట్ కే' (Project-K) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్​ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని దీపికా పదుకొణెకు చెందిన ఫస్ట్ లుక్ పోస్టర్​ను మేకర్స్ రిలీజ్​ చేశారు. అయితే దీనిపై మిక్స్​డ్​ రివ్యూస్ వస్తున్నాయి.





ఈ పోస్టర్​లో దీపిక సీరియస్​గా కనిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్​కు సంబంధించిన లుక్​లా ఉంది. కానీ ఆమె ఫేస్​ వరకే ఈ పోస్టర్​లో చూపించారు. అయితే ఈ పోస్టర్​తో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే దీనిపై కొంతమంది హాలీవుడ్​ రేంజ్​లో ఉందంటూ పాజిటివ్​ కామెంట్స్​ ఇస్తున్నప్పటికీ.. మరి కొంతమంది నెగటివ్ కామెంట్స్ ఇస్తున్నారు.

ఆ పోస్టర్ ​లో ఎటువంటి ప్రత్యేకత కానీ ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అని చెప్పే అంశాలు ఏమీ కనపడట్లేదని అంటున్నారు. స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదని చెబుతున్నారు. ఒక్క విధంగా ఇది ఫస్ట్ లుక్ కాదని.. రెగ్యులర్ లుక్ లానే ఉందని అంటున్నారు.

అలానే ఇంకొంతమంది ఈ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్​పై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాన్​ వరల్డ్​గా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో.. సినిమాపై మరింత హైప్ పెంచేందుకు ప్రమోషన్స్​ స్ట్రాటజీలో ఇంకాస్త మార్పులు చేసి బాగా చేయాల్సిందని అంటున్నారు. ఈ నిర్మాణ సంస్థ ఆడియెన్స్​ పల్స్​ను సరిగ్గా పట్టుకోలేకపోతున్నారని చెబుతున్నారు.

దీపిక పోస్టర్​ను కూడా నిన్న సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తామని చెప్పి.. చాలా గంటల పాటు ఆలస్యంగా విడుదల చేశారని చెప్పుకొచ్చారు. అంతకుముందు కూడా టైటిల్ గ్లింప్స్​ అనౌన్స్ మెంట్​ విషయంలోనూ ఇలానే చేశారని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ ఆలస్యంగా అప్డేట్స్​ ఇచ్చినప్పటికీ అవి ఆసక్తి పెంచేలా లేవని చెబుతున్నారు.

ఇకపోతే జులై 20న యూఎస్​ఏలో జులై 21న ఇండియా ఈ చిత్ర టైటిల్​ గ్లింప్స్​ విడుదల చేయనున్నారు. ప్రఖ్యాత కామిక్‌ కాన్‌ వేదికపై ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్న మొదటి ఇండియన్ సినిమాగా 'ప్రాజెక్ట్‌ కె' చరిత్ర సృష్టించనుంది. చిత్రంలో ప్రభాస్​తో పాటు బాలీవుడ్‌ బిగ్​ బీ అమితాబ్‌ బచ్చన్‌, కోలీవుడ్‌ స్టార్​ కమల్‌హాసన్‌, హాట్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తున్నారు.