గుసగుస .. పెద్దాయనకు ఘాటు ముద్దేల డీపీ?
బుగ్గపై చుంబనాన్ని పెక్ అని అంటారు. కానీ ఈ పెక్ అలా లేదు. కాస్త ఘాటుగానే చుంబిస్తున్నట్టు కనిపిస్తోంది.
By: Tupaki Desk | 16 Sep 2023 4:37 AM GMTబుగ్గపై చుంబనాన్ని పెక్ అని అంటారు. కానీ ఈ పెక్ అలా లేదు. కాస్త ఘాటుగానే చుంబిస్తున్నట్టు కనిపిస్తోంది. అసలే బ్లాక్ బస్టర్ వచ్చిన వేళ, సక్సెస్ సంబురంలో ఇలా కింగ్ ఖాన్ ని మురిపెంగా ముద్దు పెట్టేసుకుంది అందాల దీపిక. అయితే ఖాన్ జీ చెంపపై పద్మావతి తీపి ముద్దు పెట్టడంతో అతడిపై నెటిజనులు అసాధారణంగా స్పందిస్తున్నారు. జవాన్ సినిమా పోస్ట్ రిలీజ్ ఈవెంట్ లో ఈ అరుదైన సన్నివేశం కనిపించింది. సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్‌లో కనిపించిన దీపికా పదుకొణె షారుఖ్‌తో కలిసి దిగిన ఓ అందమైన ఫోటోను షేర్ చేసింది.
అసలు ఆ పెక్ వెనక ఉన్న అసలు కథేమిటో ఇప్పుడు చర్చ సాగుతోంది. వివరంలోకి వెళితే.. ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ జవాన్ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని సాధించింది. ఈ భారీ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ముంబైలో పోస్ట్-రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది టీమ్. ఇందులో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ - సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన దీపికా పదుకొనే సహా తారాగణం ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దీపిక సోషల్ మీడియాలో కింగ్ ఖాన్ కి పెక్ ఇచ్చిన ఫోటోని షేర్ చేసారు. ఇది క్షణాల్లో అంతర్జాలంలో వైరల్ అయింది. దీనిపై నెటిజనుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దాయనకు మరీ అంత ఘాటు ముద్దేల? అంటూ ఒక అభిమాని ప్రశ్నించారు. షష్ఠి పూర్తికి చేరువైన బాద్ షాకి దీపిక మరీ ఇంత డీప్ పెక్ ఇవ్వాలా? అంటూ కొందరు చిలిపిగా ప్రశ్నిస్తున్నారు. ఇక దీపిక పదుకొనే ఇంతకుముందు పఠాన్ లో వేడెక్కించే బికినీలతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో షారూఖ్ తో ఘాటైన రొమాన్స్ తో అదరగొట్టింది. దానిపై కొన్ని వివాదాలు కూడా తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే.
జవాన్ ఈవెంట్లో మీడియాతో పరస్పర ఇంటరాక్షన్, లైవ్ ప్రదర్శనలు, పుష్కలంగా ఉత్సాహం భావోద్వేగాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ నల్లటి సూట్‌లో స్టైలిష్‌గా దుస్తులు ధరించగా, దీపికా పదుకొణె తెల్లటి చీరలో నల్లటి మెరిసే అంచుతో అద్భుతంగా కనిపించింది. దీపిక ఇన్ స్టాలో వరుసగా ఫోటోలను షేర్ చేసింది. అయితే పోస్ట్‌లోని చివరి ఫోటో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ ఫోటోగ్రాఫ్ లో దీపిక నేరుగా షారూఖ్ చెంపపై తీపి పెక్ ఇస్తూ కనిపించింది. SRK ఆమె చుట్టూ చేయి వేసాడు. ఖాన్ ట్రేడ్ మార్క్ స్మైల్ ఆకట్టుకుంటోంది. ``ఇది నాకు చివరిది... (హార్ట్ ఎమోజీలు)`` అని దీపిక క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో వెబ్ లోకి రాగానే, ఒకటే గుసగుసలు. అభిమానులు వ్యాఖ్యల విభాగంలో చెలరేగారు. ఒక అభిమాని ఇలా రాశాడు.. ఇది మాకు కూడా.. రాణి - రాజు చివరిది .... చివరిది మొదటిది పోస్ట్ చేయాలి అని కూడా ఒకరు అన్నారు. బియాండ్ బ్యూటిఫుల్- తెరపై బెస్ట్ పెయిర్ వంటి వ్యాఖ్యలతో వారు ప్రియమైన జంటపై ప్రేమను వ్యక్తీకరిస్తూనే ప్రశంసలు కురిపించారు.
ఈ కార్యక్రమంలో షారుఖ్ - దీపిక కూడా జవాన్‌లోని చలేయా పాటకు నృత్యం చేశారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వేదికపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చినందుకు దీపికకు కృతజ్ఞతలు తెలుపుతూ SRK ఇలా అన్నాడు `` ఆమె హృదయం చాలా పెద్దది. మేము ఒకరికొకరు చాలా సన్నిహితులం. మేము ఒకరినొకరు కుటుంబంలా ప్రేమిస్తాము. అయితే కొన్నిసార్లు పని - వృత్తి కోసం మా కలయిక. నటిగా కూడా ఆమె ఇలా చేయడానికి చాలా ధైర్యం కావాలి`` అని షారూఖ్ వ్యాఖ్యానించారు.