Begin typing your search above and press return to search.

అరియానా హీటెక్కించే స్టిల్స్.. అస్సలు తగ్గట్లే

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి సోషల్ మీడియా యూజర్స్ కు పరిచయమే.

By:  Tupaki Desk   |   3 Sep 2023 7:45 AM GMT
అరియానా హీటెక్కించే స్టిల్స్.. అస్సలు తగ్గట్లే
X

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి సోషల్ మీడియా యూజర్స్ కు పరిచయమే. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గుర్తింపు చాలా తాపత్రయపడిన ఈ బ్యూటీ ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయిపోయింది. బిగ్ బాస్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది. తన క్యూట్ వాయిస్ తో యాంకర్ గా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. బుల్లితెర పలు షోలల్లో మెరుస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ అదిరిపోయే ఫొటోషూట్ తో మెస్మరైజ్ చేసింది.


వివరాళ్లోకి వెళితే.. ఆ మధ్యలో సోషల్ మీడియాలో కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ తో కలిసి జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేసి.. ఫుల్ పబ్లిసిటీ సంపాదించుకుంది అరియానా. దీంతో అప్పటి నుంచి అరియనాకు నెట్టింట్లో మరింత క్రేజ్ పెరిగింది. అలా తనకు ఉన్న క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ పై రాణించేందుకు ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు మొదలుపెట్టింది. వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చింది.



రాజ్ తరుణ్ అనుభవించు రాజా చిత్రంలో స్పెషల్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. ఆమెకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ చిత్రంలోనూ మెరిసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.


అలా నెట్టింట్లో హాట్ సెన్సేషన్ గా మారింది. ఆన్ లైన్ మాధ్యమాల్లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. అలా ఎప్పటికప్పుడు ఈ గ్లామర్ గర్ల్ షేర్ చేస్తున్న ఫొటోస్ కు యూత్ ఫిదా అవుతూ వాటిని తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఈ క్రేజీ బ్యూటీ పరువాల ప్రదర్శన ఫాలోయింగ్ పెరిగిపోయింది.


ఈ క్రమంలోనే తాజాగా మరో అదిరిపోయే ఫొటోషూట్ తో నెటిజన్ల ముందుకు వచ్చింది. బ్లూ కలర్ చెమికీల మోడ్రన్ ఔట్ ఫిట్లలో మెరిసింది. ఈ స్లీవ్ లెస్ డ్రెస్ లో థై షో, నాభి అందాలు చూపిస్తూ మస్త్ మస్త్ పోజులిచ్చింది. సైడ్ యాంగిల్, టాప్ టు బాటమ్ యాంగిల్స్ లోనూ పోజులిచ్చి ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అదిరిపోయే అవుట్ ఫిట్ లో తన అందాలు మొత్తం హైలెట్ చేస్తూ.. తన ఫ్యాషన్ సెన్స్ తో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ అందాలకు ఎలాంటి అవకాశాలు వస్తాయో..