Begin typing your search above and press return to search.

సైమాలో అనన్య గ్లామర్ డామినేషన్!

తెలుగు అమ్మాయిలకు మన ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వరు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   16 Sep 2023 9:44 AM GMT
సైమాలో అనన్య గ్లామర్ డామినేషన్!
X

తెలుగు అమ్మాయిలకు మన ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వరు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. అయితే, టాలెంట్ ఉంటే, ఆకట్టుకునే అందం ఉంటే సత్తా చాటడానికి రెడీగా ఉన్నాం అని ఇప్పటికే చాలా మంది మన తెలుగు అమ్మాయిలు ప్రూవ్ చేశారు. వారిలో అనన్య నాగళ్ల కూడా ఒకరు. అచ్చమైన స్వచ్ఛమైన మన తెలుగు అందం అనన్య నాగళ్ల. ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగలేదు. కానీ, తనకు తగిన పాత్రలను ఎంచుకుంటోంది.

అనన్య నాగళ్ల చూటానికి చాలా అందంగా ఉంటుంది. ఎక్స్ పోజింగ్ చేయడంలోనూ ఎలాంటి మొహమాట పడదు. అయితే, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్పటికీ, ఇప్పటికీ ఆమె చాలా మార్పులు వచ్చాయి. ఆమె నటించిన వకీల్ సాబ్ కానీ,మల్లేశం కానీ విలేజ్ రోల్స్. పెద్దగా గ్లామర్ చూపించడానికి అవకాశం రాలేదు. కానీ, తాజాగా సైమా అవార్డ్స్ లో అనన్య తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేసేసింది.

రెడ్ కలర్ డ్రెస్ లో థైస్ కనిపించేలా ఫోజులు ఇచ్చింది. అంతేకాకుండా, తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తన అందాలతో మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం అనన్య ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ షాకైపోతున్నారు. ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇక, ఈ సైమా అవార్డ్స్ లో చాలా మంది తారలు మెరిశారు. అయితే, అనన్య మాత్రం తన మార్క్ చూపించింది.

ఇదిలా ఉండగా అనన్య ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసింది. కానీ, ఆమెకు వకీల్ సాబ్ మూవీతో ఎక్కువగా గుర్తింపు దక్కింది. మధ్యలో మళ్లీ పెళ్లి మూవీలో చిన్న రోల్ అయినా గ్లామరస్ గా ఆకట్టుకుంది. రీసెంట్ గా ఆమె తంత్ర అనే హర్రర్ మూవీలో నటిస్తోంది. రీసెంట్ గా ఆ మూవీ పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఈ మూవీలో సీనియర్ హీరో దివంగత శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్ హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. వీరితో పాటు, మర్యాద రామన్న ఫేమ్ హీరోయిన్ సలోనీ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనన్య ఓవైపు సోషల్ మీడియాలో ఫోటోలతో మతి పోగొడుతోంది. మరో వైపు ఇలా సైమా అవార్డ్స్ లోనూ తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. మరి ఈ తంత్ర మూవీతో ఆమెకు ఎలాంటి హిట్ దక్కుతుందో చూడాలి.