Begin typing your search above and press return to search.

ఫొటో టాక్: చీరలో కూడా ఇలా షాక్ ఇస్తున్నావేంటి అలియా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్

By:  Tupaki Desk   |   25 July 2023 1:46 PM GMT
ఫొటో టాక్: చీరలో కూడా ఇలా షాక్ ఇస్తున్నావేంటి అలియా?
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. స్టార్ కిడ్ గా తన ప్రయాణం మొదలుపెట్టి, స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తెలుగులోనూ ఆర్ఆర్ఆర్ లో మెరిసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని తల్లిగా మారింది. తల్లి అయిన తర్వాత ఆమె తొలిసారిగా ఓ సినిమాకి ఒకే చెప్పింది. అదే రాకీ ఔర్ రాణి. ఈ మూవీలో అలియా రణవీర్ సింగ్ సరసన నటిస్తోంది.


ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ విడుదల చేశారు. ఈరెండూ విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, ప్రస్తుతం అలియా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అలియా తన లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో అలియా ఎక్కువగా చీరలే కట్టుకుంటోందని ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఇప్పుడు ప్రమోషన్స్ లోనూ ఆమె అదే రకం చీరలు కట్టుకొని మెరుస్తూ కనిపిస్తోంది.

తాజాగా ఆరెంజ్, పింక్ కాంబినేషన్ లో ఉన్న చీరలో మెరిసింది. ఈ చీరలో ఆమె చాలా అందంగా కనిపిస్తున్నారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మరింత హాట్ గా కనపడుతోంది. సూపర్, హాట్, క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తల్లి అయిన తర్వాత ఆమె నటిస్తు సినిమా ఇది కావడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది.

ఈ మూవీకోసం అలియా స్పెషల్ గా ఫోటోషూట్స్ కూడా చేస్తోంది. ఇటీవల ఆమె రాజకుమారిలా ముస్తాబై ఫోటోలకు ఫోజులు ఇవ్వగా, అవి కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ చిత్రంతో పాటు అలియా హాలీవుడ్ ఫిల్మ్ 'హార్ట్ ఆఫ్ స్టోన్'లోనూ నటిస్తోంది.

కాగా, గతంలో రణవీర్, అలియా కాంబినేషన్ లో గల్లి బాయ్స్ సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. వీరి పెయిర్, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం ఇది కావడం విశేషం. అలాగే దర్శకుడు కరణ్ జోహార్ కూడా దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఈ మూవీతో మెగా ఫోన్ పట్టడం గమనార్హం. ఈ మూవీ హిట్ అయితే, అలియా కు ఆఫర్ల వర్షం కురిసే అవకాశం ఉంది.