Begin typing your search above and press return to search.

వేదిక బికినీ అందాలు.. ఎంతగా కవ్విస్తుందో..

బాణం మూవీలో నటించి అందరినీ తన అందంతో ఆకట్టుకున్న బ్యూటీ వేదిక గుర్తుందా? చాలా కాలం అయ్యింది కదా, తొందరగా గుర్తురాకపోవచ్చు

By:  Tupaki Desk   |   22 July 2023 4:14 PM GMT
వేదిక బికినీ అందాలు.. ఎంతగా కవ్విస్తుందో..
X

బాణం మూవీలో నటించి అందరినీ తన అందంతో ఆకట్టుకున్న బ్యూటీ వేదిక గుర్తుందా? చాలా కాలం అయ్యింది కదా, తొందరగా గుర్తురాకపోవచ్చు. కానీ, ఒక్కసారి చూస్తే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు.అాలాంటి అందం తనది మరి. ఈ కన్నడ బ్యూటీ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, పెద్దగా వర్కౌట్ కాలేదు.


మద్రాసి అనే సినిమాతో ఈ బ్యూటీ హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ముని మూవీతో మొదటి సక్సెస్ ని ఈ బ్యూటీ అందుకుంది. తెలుగులో కళ్యాణ్ రామ్ కి జోడీగా విజయదశమి అనే సినిమాలో నటించింది. ఆ మూవీ ఆమెకి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. తరువాత నారా రోహిత్ డెబ్యూ మూవీ బాణం సినిమాలో నటించింది. అది కూడా కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ ని వేదికకి ఇవ్వలేదు. అయితే మలయాళం నుంచి ఆఫర్స్ పెరగడంతో అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యింది.

అయితే, ఈ పాప తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్ గా సినిమాలకు దూరం అయినా, సోషల్ మీడియా ద్వారా మాత్రం పలకరిస్తూనే ఉంటుంది. ఈ పాప సోషల్ మీడియాలో తరచూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా హాట్ షోలు చేస్తూ మురిపిస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఓ ట్రాన్సపరెంట్ డ్రెస్ లో మెరవడం విశేషం.

బికినీ ధరించి, ఆ పై బ్లాక్ కలర్ ట్రాన్సపరెంట్ కోట్ వేసింది. పేరుకు పైన డ్రెస్ ఉన్నా, ఆమె అందాలన్నీ స్పష్టంగా కనపడుతుంది. ఆమె హాట్ నెస్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఎక్కడో బీచ్ దగ్గర దిగినట్లుగా ఆ ఫోటో చూస్తుంటే అర్థమౌతోంది. జుట్టు ను ఫ్రీగా వదిలేసి, చాలా అతి తక్కువ మేకప్ తో కనిపించింది. మెడలో చిన్న చెయిన్ మాత్రమే ధరించింది. పెద్దగా యాక్సరీస్ కూడా ఏమీ వేసుకోలేదు. అయినా కూడా చాలా అందంగా కనపడుతుంది.

ఫోటో పోస్టు చేసిన కొద్ది గంటలకే వేలల్లో లైకులు రావడం విశేషం. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం కొన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, తెలుగులో మాత్రం ఏమీ చేయడం లేదు.